యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ ఈరోజు తన పుట్టినరోజును జరుపు కుంటున్నాడు. సినిమాల హిట్స్ ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరస పెట్టి ఈ హీరో సినిమాలు చేసుకుంటూ పోతూ ప్రతిసంవత్సరం తన సినిమా ఉండేలా చూసుకుంటున్నాడు.

తన పుట్టినరోజు సందర్భంగా ఒక మీడియా సంస్థతో మాట్లాడుతూ ఈ యంగ్ హీరో చేసిన కామెంట్స్ పవన్ కళ్యాణ్ రవితేజా లను ఇన్ డైరెక్ట్ గా టార్గెట్ చేసేవిగా కనిపిస్తున్నాయి అంటూ కొందరి భావన. ప్రస్తుతం ఇతడు దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ డైరెక్షన్ లో చేస్తున్న మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతున్న నేపధ్యంలో ఈ మూవీని అనుకున్న విధంగా పూర్తి చేసి ఈ ఏడాది సమ్మర్ రేస్ కు మేలో విడుదల చేయాలని భావిస్తున్నాడు.

సినిమా కోసం బెల్లం కొండ తన లుక్ ను మార్చుకోవడమే కాకుండా ఈ మూవీలో క్లీన్ షేవ్ లుక్ లో కనిపించ బోతున్నాడు. ఇతడి సినిమాలు హిందీలోకి కూడ బాగా డబ్ చేస్తున్న నేపధ్యంలో అవకాసం వస్తే తనకు కూడ బాలీవుడ్ మూవీలో నటించాలి అన్న తన కోరికను బెల్లం కొండ బయట పెట్టాడు. 

ప్రస్తుతం బెల్లం కొండ సంతోష్ శ్రీనివాస్ డైరక్షన్ లో నటిస్తున్న మూవీ తమిళ సినిమా ‘తేరి’ కి రీమేక్. ఈ మూవీ రీమేక్ లో నటించాలని గతంలో పవన్ కళ్యాణ్ రవితేజాలు కూడ భావించారు. సంతోష్ శ్రీనివాస్ చాలరోజులు పవన్ కళ్యాణ్ రవితేజాల చుట్టూ తిరిగి విసిగిపోయి చివరకు ఈమూవీని బెల్లం కొండ శ్రీనుతో తీస్తున్నాడు. ఈ మూవీ చాలబాగా వస్తోందనీ ఇలాంటి మంచి కథను పవన్ కళ్యాణ్ రవితేజాలు ఎందుకు వదులుకున్నారో తనకు తెలియదు అంటూ బెల్లం కొండ చేసిన కామెంట్స్ ను బట్టి తనకు పవన్ కళ్యాణ్ రవితేజాల కంటే సినిమాల కథలను జడ్జి చేయడంలో మంచి అనుభవం ఉంది అన్నఅర్ధాలు బెల్లం కొండ మాటల్లో వినిపిస్తున్నాయి అంటూ కొందరి కామెంట్స్ ..

 

మరింత సమాచారం తెలుసుకోండి: