సిని ఆర్టిస్టుల సహాయార్ధం కోసం ఏర్పాటు చేసిన మూవీ ఆర్టిస్ట్ అసోషియన్ కు రాజకీయ రంగు పులముకుందా అంటే ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే నిజమే అని అంటున్నారు. ప్రస్తుతం నరేష్ అధ్యక్షతన మా సభ్యుల్లో గొడవలు రచ్చ చేస్తున్నాయి. మా 2020 డైరీ రిలీజ్ వేడుకలో జరిగిన రసాబాస అందరిని ఆశ్చర్య పరచాయి. నరేష్ అధ్యక్షతన అసోషియేషన్ కార్యకలాపాలు సరైన పద్ధతిలో జరగడం లేదు అన్నది రాజశేఖర్ వాయిస్.

 

అయితే అతన్ని నోరు నొక్కే ప్రయత్నం చేస్తున్నా సిని పెద్దలు. గొడవ ఏదైనా ఉంటే సామరస్యంగా పరిష్కరించుకోవచ్చని చిరంజీవి, మోహన్ బాబు వంటి సిని దిగ్గజాల మాటను కూడా పెడ చెవిన పెట్టిన రాజశేఖర్ గురువారం జరిగిన ఈవెంట్ లో చిరంజీవి, మోహన్ బాబులకు ఎదురుతిరిగాడు. మాలో మీరు అనుకున్నట్టుగా సవ్యంగా జరగడం లేదని రాజశేఖర్ తన గొంతు విప్పారు.

 

ఈవెంట్ చెడగొట్టడానికే రాజశేఖర్ ఇలా చేశాడని చిరంజీవి డైరెక్ట్ గా అనేసినా తర్వాత మళ్లీ కూల్ అయ్యాడు. మోహన్ బాబు కూడా ముందు ఆవేశంతో మాట్లాడినా తర్వాత రాజశేఖర్ పై తన అభిమానం చూపించారు. ఫైనల్ గా రాజశేఖర్ మాత్రం ఈ గొడవ తన వల్ల కాదని మా ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. చిరంజీవి, మోహన్ బాబులతో తనకు గొడవలేమి లేవని నరేష్ తోనే తన ఫైట్ అని చెప్పారు రాజశేఖర్.

 

అయితే నిన్న జరిగిన ఈ గొడవ తర్వాత మళ్లీ చిరంజీవి, మోహన్ బాబులు సైతం కూల్ స్పందించారని తెలుస్తుంది.  మాలో జరుగుతున్న ఈ గొడవలను ప్రేక్షకులకు తెలియకూడదని సిని పెద్దల ఆరాటం కనబడుతుంది. అయితే అసలు విషయం మాట్లాడుతున్న రాజశేఖర్ నోరు నొక్కేసి మరి ఈ సిని పెద్దలు సమస్య ఎలా సాల్వ్ చేస్తారో చూడాలి.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: