మెగా బ్రదర్ నాగబాబు ఈటీవీని వదలి జీ తెలుగుకి మకాం మార్చాడన్న విషయం జగమెరిగిన సత్యం. అయితే, మకాం మార్చిన రోజు నుంచి జిటీవీ వాళ్ళతో కుమ్మక్కయి ఈటీవీని దెబ్బతీయాలనే విధంగా నాగబాబు వ్యవహరిస్తున్నాడు. జబర్దస్త్ ప్రముఖ హాస్యనటులని లాక్కెళ్లి వారితో జబర్దస్త్ షో మీదనే పంచులు వేయిస్తున్నాడు నాగబాబు. అయితే, ఇదంతా గమనిస్తున్న ఈటీవీ వాళ్లకు మాత్రం ఆగ్రహం కట్టలు తెంచుకుంటుంది. దీంతో, ఎప్పుడు ఎదురు దెబ్బతీయాలా అని ఈటీవీ యాజమాన్యం కాసుకుకూర్చుంది.


ఇదిలాఉండగా, అచ్చం జబర్దస్త్ షోని కాపీ కొట్టి అందిరింది అనే కామెడీ షో కొన్ని రోజుల నుండి ప్రసారం చేస్తుంది జీతెలుగు. అయితే, జీతెలుగు తో కుమ్మక్కయిన నాగబాబుని ఎదురు దెబ్బ తీయడానికి ఇదే సరైన సమయంగా భావించింది ఈటీవీ. అదిరింది షో ప్రసారమయ్యే టైంకి ఈటీవీ కూడా ఇంతకు ముందు జరిగిన జబర్దస్త్ స్కిట్లలో నాగబాబు హైలెట్ అయిన ఎపిసోడ్లను ప్రసారం చేయబోతుంది. అదిరింది షో ఆదివారం రోజు 9:30 గంటలకు ప్రారంభం అయితే... ఈటీవీలో అదే సమయానికి నాగబాబు హైలెట్ అయినా జబర్దస్త్ స్కిట్లు ప్రసారమవుతాయి. అయితే ఈ జబర్దస్త్ స్కిట్ లో జడ్జిమెంట్ ఇవ్వడాలు లాంటివి ఎడిట్ చేసి, యాడ్స్ లేకుండా ప్రసారం చేయబోతుంది ఈటీవీ. దాంతో అదిరింది షో కంటే ఈటీవీ లో వస్తున్న రీ ఎడిటింగ్ జబర్దస్త్ స్కిట్లు బాగుంటాయని టాక్.


దీంతో, ఈ రెండో టీవీ ఛానెళ్ల మధ్య జరుగుతున్న యుద్ధంలో ఈటీవీదే పైచెయ్యి అని స్పష్టమవుతుంది. కాకపోతే, నాగబాబు ఉన్నపుడు జబర్దస్త్ షోని అతడే ముందుండి నడిపించి షోని మరింత హాస్యభరితంగా మార్చేవాడు. ఆయన లేకపోయేసరికి జబర్దస్త్ షోలో కాస్త లోటు ఏర్పడిందని చెప్పుకోవచ్చు. ఏదేమైనా నాగబాబు ఈటీవీ నుంచి తొలగిపోవడంతో.. ఎవరికీ లాభం లేకుండా అయిపోయింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: