ఈ మధ్యకాలంలో విడుదలవుతున్న సినిమాలను చూస్తుంటే నా బూతే నా భవిష్యత్తు అన్న రీతిలో ఉంటున్నాయి. రామ్ గోపాల్ వర్మ లాంటి దర్శకుడే శృంగారభరిత సినిమాలను తీసినప్పుడు మేమెందుకు తీసి నాలుగు డబ్బులు సంపాదించుకోకూడదని కొత్తగా వస్తున్న దర్శకులు అనుకుంటున్నారేమో కానీ ప్రస్తుతం ఏ సినిమా చూసినా అవి పూర్తి శృంగార భరిత చిత్రాలుగా తెరపైకేక్కుతున్నాయి. తాజాగా విడుదలైన కిస్ టీజర్ చూస్తే అది నిజమని పూర్తిస్థాయిలో అర్థమవుతుంది.



ఇకపోతే, ఈ కిస్ సినిమా టీజర్ విడుదలై 18 గంటలు అవుతుంది.18గంటల్లో పదివేల మంది ప్రజలు చూశారు. బాగానే లైకులు కూడా ఈ సినిమాకి వచ్చాయంటే కొంతమంది ఈ టైపు చిత్రాలకు ఎట్రాక్ట్ అవుతున్నారని తెలుస్తుంది. ఇక టీజర్ గురించి చెప్పుకుంటే... ఫస్టు ఫస్టే ఘాటైన ఫ్రెంచ్ కిస్ తో మొదలయ్యి..ఆపై అన్నీ సెక్స్ సీన్స్ లను చూపించి ముగిస్తుంది. అయితే, టీజర్ చూసిన తర్వాత మొట్టమొదటిగా ప్రతి ఒక్కరి నోట వచ్చే మాట ఏంటంటే.. 'థూ, దీనెమ్మ జీవితం ఏంటి రా బాబు ఇది' అని. అస్సలు టీజరే ఇలాగ ఉంటే నా సామిరంగా ఒక్కసారి థియేటర్లకు వచ్చి చూడండి సినిమా ఎలా ఉంటుందో చూపిస్తామనట్లు ఈ టీజర్ ని కట్ చేశారు చిత్ర బృందం.



అయితే, ఇటువంటి సినిమాలకి సెన్సార్ బోర్డు ఎలా సర్టిఫికెట్లను ఇస్తుందో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. మొన్న ఆ మధ్య వచ్చిన సినిమాలను చూసి.. ఛీ, ఛీ!! ఇటువంటి సినిమాల వాళ్లే యువత చెడిపోయి మానభంగాలు చేస్తున్నారన్న వాదనలు వినబడ్డాయి. అటువంటి సినిమాలని థియేటర్లలో చూపించేందుకు సెన్సార్ బోర్డు అనుమతిస్తుందంటే.. ఆ సెన్సార్ బోర్డు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. సరే, ప్రస్తుతం ఈ విషయాన్ని పక్కన పెడితే...


ప్రస్తుతం చిత్ర కథల విషయానికొస్తే.. దర్శక, నిర్మాతలు దయ్యాలను బాగా వాడేసుకుంటున్నారన్న విషయం తెలిసిపోతుంది. కిస్ సినిమాలో కూడా అదే దయ్యం కాన్సెప్ట్ యూజ్ చేసుకున్నారు ఈ చిత్ర బృంద సభ్యులు. మొన్నటి వరకూ దయ్యాలతో సర్కస్ విన్యాసాలు, ఇంకా కుళ్ళు కామెడీ చేసి.. ఇప్పుడు వాటితో ఏకంగా వయాగ్రాని పట్టించి మరీ శృంగారం చేయిస్తున్నారు దర్శకులు. ఇక ఇది చూసిన నెటిజన్లు... హవ్వ, అపరిమిత శక్తులున్న దయ్యాలు వయాగ్రా మింగడమేంట్రా మీ దుంపతెగా అని ఎద్దేవా చేస్తున్నారు. ఏదేమైనా, ఇటువంటి వయాగ్రా మింగిన దయ్యాల సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాకపోవడమే సమాజానికి బెటర్.

మరింత సమాచారం తెలుసుకోండి: