ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత టాలీవుడ్ ఇండస్ట్రీలో అప్పటికీ ఇప్పటికీ పరిస్థితులు చాలా మారాయి. తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వ్యవహరించే వారికి జగన్ వంత పాడే పరిస్థితి టాలీవుడ్ లో లేదు. మరోవైపు తెలుగుదేశం పార్టీ అనుకూల ధోరణి కూడా టాలీవుడ్ ఇండస్ట్రీలో క్రమక్రమంగా తగ్గుతోంది. మరోవైపు టాలీవుడ్ ఇండస్ట్రీలోని సమస్యలను ఒకప్పుడు దాసరి నారాయణ రావు పరిష్కరించేవారు. 
 
ఇప్పుడు ఇండస్ట్రీలో దాసరి నారాయణరావు స్థానాన్ని చిరంజీవి భర్తీ చేస్తున్నారు. నిన్న మోహన్ బాబుకు ముద్దు పెట్టి తమ మధ్య ఎటువంటి గొడవలు లేవని చిరంజీవి చెప్పకనే చెప్పారు. మోహన్ బాబు సీఎం జగన్ కు బంధువు కాగా చిరంజీవి కూడా జగన్ తో సన్నిహితంగానే మెలుగుతున్నారు. సైరా సినిమా విడుదలైన కొన్ని రోజుల తరువాత చిరంజీవి తన సతీమణి సురేఖతో పాటు సీఎం జగన్ ను కలిసి సైరా సినిమా వీక్షించమని కోరిన విషయం తెలిసిందే. 
 
సీఎం కేసీఆర్ తెలుగుదేశం పార్టీ అనుకూల ఇండస్ట్రీకి అనుకూలం కాదు మరియు వ్యతిరేకం కాదు. కేసీఆర్ టాలీవుడ్ ఇండస్ట్రీ హైదరాబాద్ లోనే ఉండాలని కోరుకుంటున్నారు. కేసీఆర్ చిరంజీవి మధ్య కూడా సంబంధాలు బాగానే ఉన్నాయి. టాలీవుడ్ ఇండస్ట్రీలో చిరంజీవి పెద్దరికానికి ఏపీ సీఎం జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్ ప్లస్ అయ్యారని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. 
 
రాజకీయాలకు పూర్తిగా దూరమై సినిమాలకు పరిమితమైన చిరంజీవి అటు సీఎం కేసీఆర్ కు, ఇటు సీఎం జగన్ కు సన్నిహితంగా మెలగడం చిరంజీవికి మేలు చేకూరుస్తోందని ఫిల్మ్ నగర్ వర్గాల నుండి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు చిరంజీవి వివాదాలకు కూడా దూరంగా ఉంటాడు కాబట్టి చిరు పెద్దరికానికి టాలీవుడ్ సినీ జనాలు కూడా అనుకూలంగా ఉన్నారు. ప్రస్తుతం టాలీవుడ్ కు చిరంజీవి పెద్దరికం చాలా అవసరమని సినీ వర్గాల నుండి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: