టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్‌‌కు భారీగా అభిమానులు ఏర్పడటానికి కారణం... స్టైల్ విషయంలో, డాన్స్ విషయంలో తనదైన ప్రత్యేకత చూపించడమే. అందుకే అతడు 'స్టైలిష్ స్టార్'గా పాపులర్ అయ్యారు. బన్నీకి కేవలం సౌత్ ఇండస్ట్రీలోనే కాదు... బాలీవుడ్ ఇండస్ట్రీలోనూ అభిమానులు ఉన్నారు.. అంతలా ఆకట్టుకుంటాడు అభిమానుల్ని..

 

బాలీవుడ్ లో అభిమాని ఎవరా?? అని అనుకుంటున్నారా !!!గల్లీబాయ్' మూవీ ద్వారా పాపులర్ అయిన సిద్ధాంత్ చతుర్వేది ఇటీవల హైదరాబాద్ వచ్చినపుడు తెలుగులో తను ఇష్టమైన స్టార్ అల్లు అర్జున్ అని, ఆయన్నుకలవాలనే కోరికను వెలుబుచ్చారు...  ‘గల్లీ బాయ్' నటుడు సిద్ధాంత్ చదుర్వేది కూడా తనను అభిమానించే వారిలో ఒకరు అని తెలిసి ఆశ్చర్యపోయారట.. తప్పకుండ అతన్ని కలుస్తా అని అన్నారు ఒక ఇంటర్వ్యూలో...

 

అయితే అల్లు అర్జున్ అభిమాని అయిన సిద్దాంత్ చతుర్వేది కి ఎప్పుడు ఒక బెదిరింపు మెసెజ్ వచ్చింది.. కాని అయన దానికి దడవకుండా అంతే ఘాటుగా రిప్లై ఇచ్చాడు.. ఎంతయినా గల్లీబాయ్ కదా !! వివరాలలోకి వెళితే త్వరలో సిద్ధాంత్.. అగ్ర కథానాయిక దీపిక పదుకోన్‌తో కలిసి ఓ సినిమాలో నటించబోతున్నాడు. ఈ విషయాన్ని సిద్ధాంత్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ప్రకటించాడు. ‘త్వరలో నేను దీపిక పదుకోన్, అనన్య పాండేతో కలిసి నటించబోతున్నాను’ అని పేర్కొన్నాడు.

 

ఈ పోస్ట్ చూసి దీపిక అభిమాని అయిన ఓ నెటిజన్‌కు ఒళ్లు మండింది.దాంతో సిద్ధాంత్‌ను అతను బెదిరించాడు. ‘సాలే దీపిక పదుకోన్‌తో రొమాన్స్ చేసే అవకాశం వచ్చిందా నీకు. నిన్ను చంపేస్తా’ అని బెదిరించాడు.

 

అయితే ఈ బెదిరింపులకు సిద్ధాంత్ ఏమీ భయపడలేదు. పైగా అతనికి మూతి పగిలేలా ఆన్సర్ ఇచ్చాడు. ‘ఏం చేయమంటావ్. నన్ను దీపికతో రొమాన్స్ చేయనివ్వు. ఆ తర్వాత నన్ను చంపేయ్. ఎలాగో దీపిక పదుకోన్‌తో రొమాన్స్ చేసి చేసి నేనే చచ్చిపోతా’ అని రిప్లై ఇచ్చాడు.ఎంతయినా అల్లు అర్జున్ ఫ్యాన్ కదా... ఇపుడిపుడే సిద్దాంత్ కి మంచి ఆఫర్లు వస్తున్నాయి.. 

మరింత సమాచారం తెలుసుకోండి: