లక్ష్మీరాయ్ గా పరిచయమైన హాట్ బ్యూటి హీరోయిన్ గా ఒకటి అరా సినిమాలలో నటించింది. కాని సక్సస్ కాలేకపోయింది. అందుకే రాయ్ లక్ష్మీ గా పేరు మార్చుకుంది. అయినా అంతంతమాత్రంగానే సాగుతోంది. కాని క్యారెక్టర్స్ మాత్రం బాగానే వచ్చాయి. కొన్ని స్పెషల్ సాంగ్స్ అంటే మనం ఐటం సాంగ్స్ అంటాము వాటిలో బాగానే పాపులర్ అయింది. అందుకు కారణం ఈ బ్యూటీ కాస్త సెక్సీ గా డాన్స్ చేస్తూ కుర్రాళ్ళని పిచ్చెక్కిస్తుంది. అందుకే మెగాస్టార్, పవర్ స్టార్, మాస్ రాజా ల తో మంచి మసాలా సాంగ్స్ చేసి మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఇక ఆ మధ్య బాలీవుడ్ లో జూలి 2 అంటూ తన అందాలను ఆరబోస్తూ అదృష్ఠాన్ని పరిక్షించుకుంది. కానీ అక్కడ అసలు వర్కౌట్ అవలేదు. దాంతో కొన్నాళ్ళు కనిపించలేదు. అయితే తాజాగా మరో సినిమాతో తన లక్ ఎలా ఉందో చెక్ చేసుకోబోతోంది. 

 

మనిషి, జంతువు... వీళ్ళలో ఎవరు ఎక్కువ ప్రమాదకరం అని ఆలోచిస్తే.. ఆహారం కోసమో, రక్షణ కోసమో మాత్రమే జంతువు దాడి చేస్తుంది. మనిషి దాడి చేయడానికి కారణం అవసరం లేదు. ఇదే ప్రధాన అంశంగ ఆధారం చేసుకొని తెరకెక్కిన సినిమానే 'గర్జన'. శ్రీరామ్, లక్ష్మీరాయ్ జంటగా జాగ్వార్ స్టూడియోస్ పతాకంపై బి. వినోద్ జైన్ సమర్పణలో ఎం. నరేష్ జైన్ ఈ సినిమాని నిర్మించారు.

ఇండియాలో మొట్టమొదటిసారిగా విఎఫ్ఎక్స్ తో రూపొందిన పులిసినిమా ద్వారా ఎక్కువసేపు వెండితెరమీద కనిపించనుంది. ఓ చిన్నారి, ఓ యువతి, పులి మధ్య సాగే ఈ పులి వేట ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతుందని సమాచారం. టామ్ అండ్ జెర్రీ కథ లా సాగే ఈ వేట చివరికి ఎలా ముగుస్తుందో తెర మీద చూడాల్సిందేనని చిత్ర యూనిట్ అంటున్నారు. కథ, స్క్రీన్ప్ ప్లే, సినిమాటోగ్రఫీ ఎంవీ పన్నీర్ సెల్వమ్ కాగా విజువల్ ఎఫెక్ట్స్ తో రూపొందిన పెద్దపులి ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని నిర్మాత ధీమాగా ఉన్నారు.

 

జె.పార్తిబన్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ప్రముఖ దర్శకుడు బాలా వద్ద దర్శకత్వ శాఖలో పనిచేసిన పార్తిబన్ పలు యాడ్ ఫిల్మ్ లు రూపొందించిన అనుభవముంది. అడయార్ ఫిల్మ్ ఇన్ స్టిట్యూట్ విద్యార్థిగా సినిమా రంగంలోకి అడుగుపెట్టారు. పొలాచ్చి, తలకొన, మున్నార్, చెన్నై, ఊటీ, కొడైకెనాల్ తదితర లొకేషన్లలో చిత్రీకరణ జరిపారు. త్వరలోనే ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా మోషన్ పోస్టర్ ను శుక్రవారం విడుదల చేశారు.  శ్రీరామ్, లక్ష్మీరాయ్ జంటగా నటించిన ఈ చిత్రంలో ఇంకా దేవ్ గిల్, నైరా, వైష్ణవి చంద్రన్ మీనన్, ద్వైత, బ్లాక్ పాండి తదితరులు ఇతర పాత్రలను పోషించారు. ఎడిటింగ్ - సుదర్శన్, సంగీతం - అరుళ్ దేవ్, ఆర్ట్ - మిలన్ అండ్ ఎస్. రాజమోహన్, పీఆర్వో - సురేష్ కొండేటి, వీఎఫ్ ఎక్స్ - నాక్ స్టూడియోస్, డిజైన్స్, మోషన్ టీజర్ ఆర్ ఆర్ట్ స్టూడియో.

మరింత సమాచారం తెలుసుకోండి: