ఒకప్పుడు హీరో అంటే చాలా సెటిల్డ్ గా.. డీసెంట్ గా ఉండాలనే ఆలోచన ఉండేది.. కాని విజయ్ దేవరకొండ వచ్చాక సీన్ మొత్తం మారిపోయింది. పెళ్లిచూపులు సినిమాలో సెటిల్డ్ గానే కనిపించిన విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డిలో మాత్రం నెగటివ్ ఇమేజ్ తో కనిపించాడు. అయితే ఆ సినిమాలో అతని పాత్రతో యూత్ ఆడియెన్స్ కు దగ్గరయ్యాడు విజయ్ దేవరకొండ. ఆ తర్వాత వచ్చిన గీతా గోవిందం సినిమా కూడా అతనికి హిట్ అందించింది.

 

మూడంటే మూడు సినిమాలతో టాలీవుడ్ లో స్టార్ క్రేజ్ తెచ్చుకున్న విజయ్ దేవరకొండ లాస్ట్ ఇయర్ చేసిన డియర్ కామ్రేడ్ సినిమా నిరాశపరచింది. ఇక లేటెస్ట్ గా విజయ్ దేవరకొండ క్రాంతి మాధవ్ డైరక్షన్ లో వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు సంబందించిన టీజర్ కొద్ది నిమిషాల క్రితం రిలీజైంది. టీజర్ చూసిన రౌడీ ఫ్యాన్స్ మాత్రం సూపర్ ఎంజాయ్ చేస్తున్నారు.

 

విజయ్ దేవరకొండ సినిమా అంటే ఉండాల్సిన అన్ని అంశాలు ఈ మూవీలో ఉన్నట్టు తెలుస్తుంది. నిమిషం టీజర్ లోనే సినిమా చూపించేశాడు దర్శకుడు క్రాంతి మాధవ్. దేవరకొండ సరసన ఐశ్వర్య రాజేష్, రాశి ఖన్నా, కేథరిన్ త్రెసా, ఇజబెల్లా హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ప్రేమంటే ఒక కాంప్రైజ్ కు అర్ధం.. ప్రేమంటే ఒక సాక్రిఫైజ్.. ప్రేమలో దైవత్వం ఉంటుంది ఇలాంటి డైలాగ్స్ అన్ని ఇప్పటి యూత్ కు బాగా ఎక్కేస్తాయి. అంతేకాదు టీజర్ లో కిస్సులు మాత్రం మిస్సవలేదు విజయ్. 

 

ఇక వరల్డ్ ఫేమస్ లవ టీజర్ గురించి ఓవరాల్ గా చెప్పాలంటే టీజర్ ఇంప్రెసివ్ గా అనిపించినా విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి తరహా పోలికలు ఉన్నట్టుగా కనిపిస్తుంది. మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి. ఈ సినిమా ఈ ఇయర్ ప్రేమికులరోజు రిలీజ్ కాబోతుంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: