టాలీవుడ్ లో అతి తక్కువ కాలంలో సెన్సేషన్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు విజయ్ దేవరకొండ.  లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ మూవీతో పరిచయం అయిన ఈ యంగ్ డైనమిక్ హీరో పెళ్లిచూపులు మూవీతో హీరోగా మారాడు.  ఆ తర్వాత అర్జున్ రెడ్డి, గీతాగోవిందం, టాక్సీవాలా, నోటా రీసెంట్ గా డీయర్ కామ్రేడ్ మూవీతో అలరించారు.  వరుస విజయాలు అందుకుంటున్న విజయ్ దేవరకొండ తెలుగు, తమిళంలో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు.  త్వరలో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ‘ఫైటర్ ’ మూవీతో బాలీవుడ్ లోకి కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ప్రస్తుతం  మాధవ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ‘ వరల్డ్ ఫేమస్ లవర్’ మూవీలో నటిస్తున్నాడు.  ఈ మూవీకి సంబంధించిన పోస్టర్లు ఇటీవల సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ సంపాదించాయి.

 

తాజాగా ఈ మూవీకి సంబంధించిన టీజర్ రిలీజ్ అయ్యింది.  ఈ మూవీ ఫిబ్రవరి 14వ తేదీన విడదల చేయడానికి సిద్దంగా ఉన్నారు. ఆరోజు ప్రేమికుల దినోత్సవం ఈ మూవీకి బాగా కలిసి వస్తుందిని చిత్ర యూనిట్ భావిస్తున్నారు.   విజయ్ దేవరకొండ మరోసారి పూర్తిగా అర్జున్ రెడ్డి తరహా ప్రేమకథతోనే వస్తున్నాడని అర్దమైపోతుంది. ఈ మూవీలో విజయ్ సరసన ఐశ్వర్యా రాజేష్‌, ఇజా బెల్లా,  క్యాథరిన్ త్రెసా,  రాశీఖ‌న్నా నలుగురు హీరోయిన్స్ నటిస్తున్నారు. రాశీ ఖన్నా వాయిస్ ఓవర్‌తో మొదలైన ఈ టీజర్‌లో చాలా చూపించాడు దర్శకుడు క్రాంతి మాధవ్. ఇందులో విజ‌య్ దేవ‌ర‌కొండ‌ని చూస్తుంటే వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్‌గా ఆయ‌న అద‌ర‌గొట్ట‌నున్నాడ‌ని తెలుస్తుంది.

 

అయితే నలుగు హీరోయిన్స్ తో విజయ్ దేవరకొండ చేస్తున్న రొమాన్స్ పై కొంత మంది నెటిజన్లు పెదవి విరుస్తున్నారు.  ఎంత సెన్సేషన్ హీరో అయితే మటుకు నలుగు హీరోయిన్స్ తో పిచ్చిగా రొమాన్స్ లో తేలిపోవడం ఏంటీ అంటూ రక రకాల పేరడీ ఫోటోలతో సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్ మూవీ సీనియ‌ర్ ప్రొడ్యూస‌ర్ కె.ఎస్‌.రామారావు స‌మర్పణ‌లో క్రియేటివ్ క‌మ‌ర్షియ‌ల్ బ్యాన‌ర్‌పై కె.ఎ.వ‌ల్లభ ఈ మూవీని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం తెలుగులో మంచి ఫామ్‌లో ఉన్న గోపీ సుంద‌ర్ ఈ మూవీకి సంగీతం సమకూరుస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: