సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రష్మిక మందన్న హీరోయిన్ గా యువ సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా సినిమా సరిలేరు నీకెవ్వరు. మహేష్ బాబు, మేజర్ అజయ్ కృష్ణ అనే పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో లేడీ అమితాబ్ విజయశాంతి ఒక కీలక పాత్రలో నటిస్తుండగా వెన్నెల కిషోర్, సంగీత, హరితేజ, శ్రీనివాస రెడ్డి, ప్రకాష్ రాజ్, రావు రమేష్, రఘు బాబు తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఇక ఇటీవల ఈ సినిమా నుండి రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ టీజర్, ఐదు సాంగ్స్ కూడా సూపర్ సక్సెస్ కావడంతో పాటు సినిమాపై ప్రేక్షకుల్లో, సూపర్ స్టార్ ఫ్యాన్స్ లో భారీ స్థాయిలో అంచనాలు ఏర్పరచడం జరిగింది. 

 

ఇక ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు జరుగగా సినిమాకు యు/ఏ సర్టిఫికెట్ లభించింది. కాగా ఈ సినిమాని వీక్షించిన సెన్సార్ సభ్యులు, ఓవర్ ఆల్ గా సినిమాపై మంచి ప్రశంసలు కురిపించినట్లు సమాచారం. దేశానికి సంబందించిన మంచి మెసేజ్ ని ఇవ్వడంతో పాటు పక్కాగా దర్శకుడు అన్ని రకాల కమర్షియల్ హంగులు జోడించి ఈ సినిమాని తెరకెక్కించిన విధానం ఎంతో బాగుందని అన్నారట. ఇక హీరోగా సూపర్ స్టార్ మహేష్ బాబు తో పాటు భారతి అనే ప్రొఫెసర్ పాత్రలో నటించిన విజయశాంతిల నటన ఎంతో బాగుందని, చాలా ఏళ్ళ గ్యాప్ వచ్చినప్పటికీ విజయశాంతి గారి గొప్ప నటనలో ఏ మాత్రం మార్పు రాలేదని, ఇన్నర్ గా ఆమె పాత్ర సినిమాలో ఎంతో కీలకం అని చెప్పారట. 

 

ఇకపోతే ఫస్ట్ హాఫ్ తో పాటు సెకండ్ హాఫ్ కూడా మంచి ఎమోషన్, ఎంటర్టైన్మెంట్ తో సాగుతుందని, అలానే సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, యాక్షన్ సీన్స్ తో పాటు అదరగొట్టే విజువల్స్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ అని, హీరోయిన్ రష్మిక అందంగా కనపడడంతో పాటు నటన బాగుందని, అలానే ఒక మంచి హిట్ సినిమాకు కావలసిన అన్ని హంగులు ఈ సినిమాలో ఉన్నాయని అన్నారట. ఓవరాల్ గా సంక్రాంతి కానుకగా రాబోతున్న ఈ సినిమాతో దర్శకుడు అనిల్, హీరో మహేష్ బాబులు ఇద్దరూ కూడా మరొక హిట్ అందుకోవడం ఖాయం అని అభిప్రాయపడ్డట్లు టాక్. మరొక వారం రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ఎంత మేర సక్సెస్ ని అందుకుంటుందో చూడాలి....!!

మరింత సమాచారం తెలుసుకోండి: