ఈ మద్యకాలంలో సినిమాల్లో అవకాశాలు సరిగ్గా లేక హీరోయిన్స్ అంతా దాదాపుగా బుల్లితెర షోల్లో అలరిస్తున్నారు. ఇలా ఎంతో మది హీరోయిన్స్, అటు టాలీవుడ్‌ల్లో గాని ఇటు బాలీవుడ్‌లో గాని ప్రేక్షకులను తమ యాంకరింగ్‌తో, ఆహభావాలతో అలరిస్తున్నారు. ఇక అప్పుడప్పుడు ఎవరైనా పిలిచి అవకాశమిస్తే నటిస్తున్నారు. ఇదిలా ఉండగా విక్టరీ వెంకటేష్ హస్తవాసి బాగున్నట్లుగా ఉంది. ఎందుకంటే గతంలో ఫేడవుట్ అవ్వబోయిన తమన్నాకు ఎఫ్‌2తో అదిరిపోయే కమ్‌బ్యాక్ ఇప్పించాడు వెంకీ. ఆ సినిమా హిట్టు టాక్ తెచ్చుకుంది.

 

 

అంతేకాదు బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లనే రాబట్టింది. దీంతో అప్పటివరకు హిట్టు సినిమాల కోసం ఎదురు చూస్తున్న తమన్నాకు తన ఖాతాలో ఈ సినిమా సూపర్ హిట్‌గా నిలిచిపోయింది. ఇక ఈ సినిమాతో 2019ను సక్సెస్‌ టాక్ తో ముగించిన వెంకీ ప్రస్తుతం తమిళ సూపర్ హిట్ చిత్రం అసురన్‌ను తెలుగులో రీమేక్ చేసేందుకు రెడీ అవుతున్నాడట. ఈ చిత్రానికి శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్నారు. కాగా శ్రీకాంత్ అడ్డాల గతంలో వెంకీతో సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాను తెరకెక్కించిన విషయం తెలిసిందే.

 

 

ఇకపోతే సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు మూవీ పాజిటీవ్ టాక్‌ను తెచ్చుకోవడంతో ఈసారి అసురన్ తెలుగు రీమేక్‌ బాధ్యతలను శ్రీకాంత్ అడ్డాలకు ఇచ్చారట నిర్మాత సురేష్ బాబు.. ఇక ఈ సినిమాలో వెంకటేష్ సరసన హీరోయిన్‌గా ఎవరు నటిస్తారా అని తెలుగు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమాలో వెంకటేష్‌కు జోడిగా ప్రియమణి రొమాన్స్ చేయబోతుందని సమాచారం.

 

 

సినిమా అవకాశాలు లేక టీవీ షోలు చేసుకుంటున్న ప్రియమణికి ఇది బంపర్ ఆఫర్ అనే చెప్పాలి.. ఇక మిగతా స్టార్ హీరోయిన్లను కాదని సురేష్ ప్రొడక్షన్స్ ప్రియమణిని హీరోయిన్‌గా తీసుకోవడం వెనక కూడా ఓ కారణం ఉంది. అదేమంటే నేషనల్ అవార్డు అందుకున్న ఈ బ్యూటీతో డీగ్లామర్ రోల్ చేయించడంలో ఎలాంటి ఇబ్బంది ఉండదని చిత్ర యూనిట్ భావిస్తోందట. ఇకపోతే ప్రియమణి ఈ సినిమాలో నటిస్తుందా లేదా అనేది అఫిషీయిల్‌ ప్రకటన రావాల్సి ఉందంటున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: