టాలీవుడ్ సినిమా పరిశ్రమకు రాజ్ తరుణ్ సరసన ఉయ్యాలా జంపాల సినిమాతో అడుగుపెట్టిన అవికా గోర్, నిజానికి కొన్నేళ్ల క్రితం తెలుగులో ప్రసారం అయిన డబ్బింగ్ సీరియల్ చిన్నారి పెళ్లికూతురుతో చిన్నప్పుడే మంచి పాపులారిటీ సంపాదించింది. ఒకరకంగా హిందీతో పాటు ఆ సీరియల్ అప్పట్లో తెలుగులో కూడా మంచి సక్సెస్ సాధించి, భారీగా రేటింగ్స్ కూడా దక్కించుకుంది. అయితే ఆ తరువాత హీరోయిన్ గా నటించిన తొలి సినిమా ఉయ్యాలా జంపాలతో సూపర్ హిట్ కొట్టిన అవికాకు, 

 

మరొక్కసారి రాజ్ తరుణ్ సరసన సినిమా చూపిస్త మామ అనే సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ లభించడం, అలానే ఆ సినిమా కూడా మంచి సక్సెస్ అందుకోవడం జరిగింది. అనంతరం కొంత గ్యాప్ తరువాత నిఖిల్ హీరోగా విఐ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఎక్కడికి పోతావు చిన్నవాడా అనే సినిమాతో మరొక సక్సెస్ అందుకున్న అవికా, ఇటీవల ఓంకార్ దర్శకత్వంలో తెరకెక్కిన రాజు గారి గది సినిమాలో కూడా హీరోయిన్ గా నటించింది. మొదట్లో కొంత బొద్దుగా, ఎక్కువగా ట్రెడిషనల్ డ్రెస్సులో కనిపించిన అవికా, 

 

ఇటీవల కొంత స్లిమ్ గా, మరింత గ్లామరస్ గా తయారయి, కొద్దిరోజుల క్రితం ఒక ఫంక్షన్ కు పొట్టి డ్రెస్ లో దర్శనమిచ్చి అందరికీ షాక్ ఇచ్చింది. ఇక ఆమె ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతుండగా, ఎంత చిన్నారి పెళ్ళికూరైతే మాత్రం మరీ అంత చిన్న చిన్న డ్రెస్సులు వేసుకోవాలా అంటూ ఆమెపై సరదాగా కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఇటీవల ఒక ఇంటర్వ్యూ లో అవికా మాట్లాడుతూ, క్యారెక్టర్ డిమాండ్ చేస్తే, గ్లామర్ పాత్రల్లో నటిచడానికి తాను సిద్ధం అని చెప్పడం జరిగింది. మరి ఆమె ఆశిస్తున్న విధంగా ఎంతవరకు గ్లామర్ పాత్రలు ఆమెకు లభిస్తాయో చూడాలి...!! 

మరింత సమాచారం తెలుసుకోండి: