పద్మ లక్ష్మీ ఓ వెర్సటైల్ పర్సన్. అంటే బహుముఖ ప్రజ్ఞాశాలి. చెన్నై లో జన్మించిన ఈమె అమెరికాలో పెరిగింది. అయితే, ఆమె జీవిత కాలంలో ఇప్పటివరకు రచయిత గా, మోడల్ గా, నటిగా, బుల్లితెర యాంకర్ గా, నిర్మాతగా, చివరికి వంటలక్కగా కూడా దూసుకుపోతుంది. ప్రస్తుతం అమెరికన్ టాప్ చెఫ్ అనే ఒక రియాలిటీ షోకి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఆమె ఇండియన్ వోగ్ మ్యాగజైన్ ఫోటో షూట్ లో పాల్గొన్నది. అయితే, ఆ ఫోటో షూట్ లో దిగిన ఒక ఫోటోను తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఆ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టిస్తుంది. దానికి కారణాలు లేకపోలేదు.



పద్మ తన ఎదభాగంపై ఒక (బంతి) పూలదండ తప్ప ఏ నూలుపోగు లేకుండా కేవలం తన చేతిని అడ్డుపెట్టుకొని ఫోటోకి పోజ్ ఇచ్చింది. ఇక ఇది చూసిన నెటిజన్లు 'అబ్బా, 49ఏళ్ల వయసులో కూడా పద్మ సెగలుపుట్టిస్తుంది. నువ్వు ఎప్పటికీ ఇలానే ఉండిపో, పద్మ.', అని కామెంట్లు చేస్తున్నారు. అమెరికన్ ప్రముఖులు కూడా ఈమె సెక్సీ బాడీని ఇంస్టాగ్రామ్ లో తెగ కొనియాడుతున్నారు.


పద్మకి తన టాప్ లెస్ ఫోటోలను బహిరంగంగా చూపించడం ఇదేం మొదటిసారి కాదు. ఆమె ఇంస్టాగ్రామ్ ఖాతాను ఒక్కసారి పరిశీలిస్తే.. చాలా టాప్ లెస్ ఫొటోస్ దర్శనమిస్తాయి. ఒక ఇంటర్వ్యూ లో ఆమె మాట్లాడుతూ... 'మగవాళ్లే ఎందుకు ఏ పరిమితులు లేకుండా చెస్ట్ చూపించొచ్చు. కానీ ఆడవారికి ఎందుకు ఈ నిబంధనలు' అని చెప్పుకొచ్చింది. అయితే, పద్మ కు 2004లో సల్మాన్ తో పెళ్ళై.. 2007లో అతనికి విడాకులు ఇచ్చింది. ఈ హాట్ ఫొటోస్ పద్మ అభిమానుల కోసంం ప్రత్యేకంగా

మరింత సమాచారం తెలుసుకోండి: