గత కొంతకాలంగా బాలీవుడ్, టాలీవుడ్ లో బయోపిక్స్ ని తెరకెక్కించి సెన్షేషన్స్ ని క్రియోట్ చేస్తున్నారు మేకర్స్. అమీర్ ఖాన్ దంగల్ తీసి దాదాపు 2000 కోట్ల రూపాయలు సాధించారు. బాలీవుడ్ లో ఇదొక సంచలనం. ఆ తర్వాత వరుసగా బాలీవుడ్ లో వచ్చిన బయోపిక్స్ మంచి వసూళ్ళను సాధిస్తున్నాయి. అంతేకాదు ఇప్పుడు కూడా మరికొన్ని బయోపిక్స్ బాలీవుడ్ లో తెరకెక్కుతున్నాయి. సైనా నెహ్వాల్ బయోపిక్ ని పరిణీతి చోప్రా తో తెరకెక్కిస్తున్నారు. ఇక మన తెలుగు పరిశ్రమలో మహానటి సావిత్రి జీవిత కథ ఆధారంగా మహానటి సినిమాని తీసి అద్భుతమైన సక్సస్ ని అందుకున్నారు మేకర్స్. ఇప్పుడు కోలీవుడ్ లో రాబోతున్న మరో బయోపిక్ జయలలిత ది కావడం విశేషం. 

 

ఇక తాజాగా బాలీవుడ్ లో మరో సెన్షేషనల్ బయోపిక్ తెరకెక్కుతోంది. వేల కోట్ల కుంభకోణంతో స్టాక్ మార్కెట్ ని ముంచేసిన స్టాక్ బ్రోకర్ హర్షద్ మెహతా జీవితకథను బాలీవుడ్ లో వెండితెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. 'ది బిగ్ బుల్' అనే టైటిల్ తో ఈ సినిమాని రూపొందిస్తున్నారు. బాలీవుడ్ హీరో అభిషేక్ బచ్చన్ కథానాయకుడిగా నటిస్తున్నారు. మరో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ నిర్మిస్తున్నారు. 'బోల్ బచ్చన్' సినిమా తర్వాత మళ్ళీ ఏడేళ్లకు అభిషేక్ - దేవగన్ రీయునైట్ అయ్యి ఈ సినిమా చేస్తున్నారు. కూకీ గులాటి దర్శకత్వం వహిస్తున్నారు. ఇదివరకూ ది బిగ్ బుల్ ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. మొదటి పోస్టర్ కి ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. 

 

తాజాగా కొత్త సంవత్సర కానుకగా ఈ సినిమాకి సంబంధించిన అప్ డేట్ ని అందించాడు హీరో అభిషేక్ బచ్చన్. నిరుద్యోగి అని అంటారు కదా.. ఇదిగో ఇదే నా సినిమా కొత్త లుక్ అంటూ సెటైరికల్ వేలో ఓ పోస్టర్ ని రివీల్ చేశాడు. ఈ పోస్టర్ లో స్మాల్ బి లుక్ సంథింగ్ ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఏదో నిగూఢ రహస్యం దాగి ఉంది! అన్న అర్థం ఆ పోస్టర్ లో కనిపిస్తోంది. ష్...! అంటూ జనాల్ని నిశ్శబ్దంగా ఉండమని బెదిరిస్తున్న లుక్ ఉత్కంఠ పెంచింది. అయితే ఈ పోస్టర్ రిలీజ్ అయినప్పటి నుంచి కొందరు నెటిజన్స్ మాత్రం అబిషేక్ ని అజయ్ ని దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. మీకు ఇక ఎవరి బయోపిక్ దొరకలేదా అంటూ సీరియస్ గా కామెంట్స్ చేస్తున్నారట. 

అందుకు కారణం హర్షద్ మెహతా ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయిన స్టాక్ బ్రోకర్ కం ఆర్థిక నేరస్తుడు. 5వేల కోట్ల కుంభకోణానికి పాల్పడిన ఘనుడు. ఆయన జీవితం ఆధారంగా ఈ చిత్రం రూపొందిస్తున్నారు. ఇక ఈ పోస్టర్ బ్లాక్ బస్టర్ హాలీవుడ్ మూవీ 'ది ఊల్ఫ్ ఆఫ్ వాల్ స్ట్రీట్' ని పోలి ఉంది. ఇక ఈ సినిమాలో ముందు స్ట్రగ్లింగ్ స్టార్ ఇలియానాను ఓ హీరోయిన్ గా ఎంపిక చేసారు. కానీ అనూహ్యంగా ఈ బక్క పలచని గోవా బ్యూటి ఆ ఛాన్స్ మిస్సయ్యింది. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: