టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ అంటే గుర్తొచ్చేది రొమాన్స్.. అర్జున్ రెడ్డి సినిమాతో ప్రపంచ స్థాయి హీరోగా గుర్తింపు తెచ్చుకున్న హీరోగా బాగా పేరు తెచ్చుకున్నారు.. ఇప్పుడు పాన్ ఇండియా హీరోగా అందరికీ పరిచయమయ్యాడు..ఇకపోతే విజయ్ పెరంటే సక్సెస్ ,సక్సెస్ అంటే విజయ్ అన్న విదంగా ఈ హీరో ఎదిగాడు..యూత్ లో మంచి క్రేజ్ ను కూడా సంపాదించుకున్నాడు..


ఇకపోతే ప్రస్తుతం విజయ్ క్రాంతి మాధవన్ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నాడు..ఆ సినిమాలో ఐశ్వర్యా రాజేష్‌, ఇజా బెల్లా, క్యాథరిన్ త్రెసా, రాశీఖ‌న్నాలు విజయ్‌తో జోడీ కట్టగా.. యామిని పాత్రలో రాశి ఖన్నా నటిస్తోంది. సువర్ణగా ఐశ్వర్యా రాజేష్ డీ గ్లామరస్‌గా కనిపిస్తోంది. కేథరిన్ స్మిత మేడమ్‌గా సర్ ప్రైజ్ చేసింది. ఇజా అనే పాత్ర‌లో ఇజా బెల్లె లెయితె ఫ్యాన్స్ గర్ల్ ఫ్రెండ్‌గా కనిపించింది...


విజయ్.. గౌతమ్, బొగ్గుగని శీను, శీనయ్య, ఇలా నాలుగు పాత్రల్లో సర్ ప్రైజ్ చేశాడు. ఇక 1.13 నిమిషాల నిడివితో విడుదలైన ఈ టీజర్ సినిమాపై ఆసక్తిపెంచేదిగా ఉంది. ముఖ్యంగా నలుగురు హీరోయిన్స్‌ వారితో ఉన్న రిలేషన్‌ను చూపిస్తూ ఆసక్తిపెంచాడు దర్శకుడు. విజయ్‌ని షర్ట్ లేకుండా రోడ్డుపై నిలబెట్టి సహజ సిద్ధమైన నటనను రాబట్టే ప్రయత్నం చేశారు. ఆ సినిమాలో ఎటు చూసిన కూడా విజయ్ దేవరకొండ కనిపిస్తాడని టాక్..

 

ఈ చిత్రానికి గోపీసుంద‌ర్ సంగీతం అందించారు. జ‌య‌కృష్ణ గుమ్మ‌డి సినిమాటోగ్ర‌ఫీ అందించారు. మొత్తంగా ప్రేమికుల్ని టార్గెట్ చేస్తూ ‘వరల్డ్ ఫేమస్ లవర్’ అనే క్యాచీ టైటిల్‌కి టీజర్‌తో న్యాయం జరిగిందనే చెప్పాలి. మరి ప్రేమికుల దినోత్సవం నాడు ఈ వరల్డ్ ఫేమస్ లవర్ మరో అర్జున్ రెడ్డి అవుతాడేమో చూడాలి.. ప్రేమికుల రోజు కానుకగా ఈ చిత్రం ఫిబ్రవరి 14 న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది..

మరింత సమాచారం తెలుసుకోండి: