ఒకప్పుడు లేడీ సూపర్‌ స్టార్‌గా సౌత్‌ ఇండస్ట్రీని ఏళిన నటి విజయశాంతి. పొలిటికల్‌ ఎంట్రీతో సినిమాలకు దూరమైన ఈ సీనియర్‌ లాంటి చాలాకాలం తరువాత తిరిగి సిల్వర్‌ స్క్రీన్‌ రీ ఎంట్రీ ఇస్తోంది. మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సరిలేరు నీకెవ్వరు సినిమాలో కీలకపాత్రలో నటిస్తోంది విజయశాంతి.

 

సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.అప్పుడెప్పుడో నాయుడమ్మ సినిమా తర్వాత మళ్లీ ఇన్నేళ్లకు సరిలేరు నీకెవ్వరులో కీలక పాత్రలో నటించింది లేడీ సూపర్ స్టార్ విజయశాంతి..తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ఉన్న సినిమా అవ్వడం వల్ల ఒప్పుకున్నారు. ఒకపక్క సూపర్ స్టార్, మరోపక్క లేడీ స్టార్. సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. 

 

ఎంతమంది దర్శకనిర్మాతలు విజయశాంతి రీఎంట్రీ కోసం ట్రై చేసిన ఒప్పుకోలేదు.. ఎట్టకేలకు అనిల్ రావిపూడి తన కథతో ఆమెను మెప్పించి స్క్రీన్‌పై మళ్లీ విజయశాంతిని చూసేలా చేసాడు... మహేష్ బాబు హీరో, కదా నచ్చింది అలానే విజయశాంతి క్యారెక్టర్ కూడా ఏ సినిమాకి కీలక మలుపు అంట. అందుకే కధ వినగానే ఒప్పుకుంది.. సినిమాలో విజయశాంతి పాత్ర చాలా హూందాగా ఉంటుందట.అలాగే సరిలేరు నీకెవ్వరు సినిమాలో మహేష్ బాబుతో సహా అన్ని పాత్రలు కూడా కామెడీ చేస్తాయని..

 

కానీ ఒక్క విజయశాంతి మాత్రమే కామెడీకి దూరంగా ఉంటుందని తెలిపారు అనీల్ రావిపూడి.. అంటే చాలా సీరియస్ చారెక్టర్ అంట విజయశాంతిది. హీరో మహేష్‌ బాబుకు సమానమైన పాత్ర కావటంతో నటించేందుకు అంగీకరించింది. అంతేకాదు ప్రమోషన్‌ విషయంలోనూ విజయశాంతిని హీరోకు సమానంగా ట్రీట్ చేస్తున్నారు సరిలేరు నీకెవ్వరు టీం..

 

అలాగే తర్వాత సినిమాలకి కూడా ప్లాన్ చేసుకుంటున్నారట విజయశాంతి... రెమ్యూనిరేషన్ కూడా హీరోయిన్ స్థాయిలో ఇవ్వాలని, సినిమాలో తనకంటూ ఒక ప్రత్యేకమయిన పాత్ర ఉంటేనే చేస్తా అని కండిషన్స్ పెట్టారట... ఎంతయినా డైనమిక్ లేడీ కదా.. కండిషన్స్ ఉంటాయి మరి. 

మరింత సమాచారం తెలుసుకోండి: