రజినీకాంత్ దేశంలో వివాదరహితుడిగా, సౌమ్యుడిగా, పేరుంది.  అందుకే అయన సినిమాలను దేశంలోని ప్రజలందరూ ఆదరిస్తారు.  సూపర్ స్టార్ గా ఆయన్ను నెత్తిన పెట్టుకుంటారు.  తాను సంపాదించే డబ్బులో 50శాతం దానధర్మాలు చేస్తుంటాడు.  మాస్ హీరోగా మెప్పిస్తాడు.  సినిమా పూర్తయ్యాక రజినీకాంత్ హిమాలయాలకు వెళ్లి ఒక యోగిగా కొన్నాళ్ళు అక్కడే గుహల్లో సాధువుల మధ్య తిరుగుతూ తపస్సు చేసుకుంటారు.  అదే ఆయన్ను మరికొన్నాళ్లు హ్యాపీగా పనిచేసేలా చేస్తుంది.  


అలాంటి రజినీకాంత్ గురించి శ్రీరెడ్డి కొన్ని మాటలు చెప్పింది.  నిజంగా అవి వింటే నవ్వాలో ఏడవాలో అర్ధం కావడం లేదు.  తెలుగు సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ పై పెద్ద రగడ చేసిన శ్రీరెడ్డి, ఇప్పుడు చెన్నై వెళ్లి అక్కడే సెటిల్ అయ్యింది.  చెన్నైలోనే స్థిరపడేందుకు ట్రై చేస్తున్నది.  చెన్నై వెళ్లి భక్తిని పెంచుకుంది.  పబ్బుల్లో పెట్టి డ్రెస్ లలో దర్శనం ఇచ్చే శ్రీరెడ్డి గుడికి వెళ్లే సమయంలో పవిత్రంగా ఎర్రటి చీరల్లో కనిపిస్తుంది.  


ఇప్పుడు ఆమెకు రాజకీయాల్లోకి రావాలని ఉందట.  ఒకవేళ రాజకీయాల్లోకి వస్తే ఏ పార్టీలో ఉంటారు.. అనే ప్రశ్నకు ఆమె పేస్ బుక్ ద్వారా సమాధానం ఇచ్చింది.  తనకు రజినీకాంత్ అంటే చాలా ఇష్టం అని.  ఆయనకు దైవభక్తి ఎక్కువ అని, వివాద రహితుడిగా పేరు ఉందని, రజినీకాంత్ కూడా చాలా కాలంగా రాజకీయాల్లోకి రావాలని అనుకుంటున్నారని, అయన సొంతంగా పార్టీ పెడితే ఆ పార్టీలో తాను చేరతానని, రజినీకాంత్ తో కలిసి పనిచేస్తా అని అంటోంది.  


ఒకవేళ రజినీకాంత్ పార్టీ పెట్టకుండా ఏ పార్టీకైనా సపోర్ట్ చేస్తే తాను కూడా అదే పార్టీకి సపోర్ట్ చేస్తానని అంటోంది శ్రీరెడ్డి.  మొత్తానికి శ్రీరెడ్డి రజినీకాంత్ పై దృష్టి పెట్టింది.   ఎలాగో తమిళనాడులో ఉన్నది.  రజినీకాంత్ కు మాస్ ఫ్యాన్స్ ఎక్కువ.  ఆయన్ను దైవంగా ఆరాధిస్తారు.  అందుకే వాళ్ళ మన్ననలు పొందేందుకు శ్రీరెడ్డి ప్లాన్ చేసింది.  ఎన్ని వివాదాలు ఉన్నా, రజినీకాంత్ వంటి వ్యక్తిని ఆరాదిస్తే చాలు.  లైఫ్ సెటిల్ అయ్యినట్టే అనే భావనకు వచ్చినట్టుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: