పవన్ కళ్యాణ్ తనకు తానుగా తాను ‘పింక్’ రీమేక్ లో నటిస్తున్నాను అంటూ ఓపెన్ గా అనకపోయినా పవన్ ‘పింక్’ రీమేక్ లో లాయర్ గా కనిపించడం ఖాయం. అయితే ఈమూవీ ఎంతవరకు పవన్ అభిమానులకు కనెక్ట్ అవుతుంది అన్నసందేహాలు ఉన్న నేపధ్యంలో దర్శకుడు వేణు శ్రీరామ్ ఈమూవీలో చాల మార్పులు చేస్తున్నట్లు లీకులు వస్తున్నాయి. 

వాస్తవానికి అమితాబ్ నటించిన ఒరిజినల్ మూవీలో అమితాబ్ 70 సంవత్సరాల వయసు ఉన్న వృద్ధ లాయర్ గా కనిపించాడు. కోర్ట్ హాల్ సీన్ లో కూర్చునేడప్పుడు లేదా లేచేడప్పుడు ఒక వృద్ధుడు ప్రవర్తించే తీరులో అతడి నటన ఉంది. అయితే పవన్ మటుకు ఈరీమేక్ లో 50 సంవత్సరాల మధ్య వయస్సతో ఉండే పాత్రలలో కనిపిస్తూ బాగా సూట్ అయ్యే జీన్స్ ప్యాంట్ తెల్ల షర్ట్ నల్లకోటుతో కనిపిస్తాడని ఇప్పటికే వార్తలు వినిపిస్తున్నాయి.

ఇప్పుడు ఇది చాలదు అన్నట్లుగా వేణు శ్రీరామ్ ఈమూవీలో పవన్ అభిమానులను దృష్టిలో పెట్టుకుని కొన్ని యాక్షన్ సీన్స్ కొన్ని ఫైట్ సీన్స్ కూడ ఈమూవీ కోసం క్రియేట్ చేసినట్లు తెలుస్తోంది. గతంలో ‘పింక్’ ను తమిళంలో రీమేక్ చేసినప్పుడు కూడ కోలీవుడ్ లో అజిత్ ఇమేజ్ దృష్టిలో పెట్టుకుని చాల మార్పులు చేసారు. ఇప్పుడు ఈమూవీ తెలుగు రీమేక్ లో కూడ అజిత్ ఫార్మలాను పవన్ కు వాడుతున్నట్లు తెలుస్తోంది. 

‘పింక్’ తెలుగు రీమేక్ షూటింగ్ ప్రారంభం అయ్యే మార్చి నెల ప్రాంతానికి సమ్మర్ వచ్చేస్తుంది కాబట్టి పవన్ కళ్యాణ్ ఏ విధంగాను షూటింగ్ లో అలిసిపోకుండా ఈసినిమాకు సంబంధించి సెంట్రల్ ఎయిర్ కండిషన్ సెట్ ను దిల్ రాజ్ పవన్ కోసం వేయిస్తూ పవన్ రోజుకు నాలుగు ఐదు గంటలు పని చేస్తే చాలు అంటూ అనేక రాయితీలు ఇస్తూ సుమారు 50 కోట్ల పారితోషికాన్ని పవన్ కు ముట్టచేబుతున్నారు అంటే పవన్ స్టామినా ఏమిటో అర్ధం అవుతుంది. అయితే ప్రతిరోజు న్యూస్ పేపర్ మీడియాలో ఎక్కడో అక్కడ రేప్ సీన్స్ కు సంబంధించి వార్తలు రావడం సర్వసాధారణం అయిన విషయంలో ఇలా అందరికీ తెలిసిన ఒక కథను పవన్ రీ ఎంట్రీ మూవీగా తీస్తే ఎంతవరకు సగటు ప్రేక్షకుడు కనెక్ట్ అవుతాడు అన్నదే సమస్య..   

 

మరింత సమాచారం తెలుసుకోండి: