రోడ్ల పైన, బస్సులో నిండారా బట్టలు వేసుకున్న చూపులతో తినేసేలా చూసే ఈ లోకంలో.. ఆడవాళ్లు కనబడితే అసలు వదలని ఈ రోజుల్లో ఇక సినిమాలోని హీరోయిన్ల పరిస్దితి చెప్పలేనిదట. ఇదే కాకుండా కమింట్‌మెంట్ పేరుతో జరిగే శరీర దోపిడి గురించి ఇప్పటికే చాలా మంది హీరోయిన్లు బాహాటంగానే సిగ్గుపడకుండా చెప్పుకొచ్చారు. ఇక ఈ మద్యకాలంలో సినీ, టీవీ రంగాన్ని కుదిపేసిన కాస్టింగ్‌ కౌచ్, నటీమణుల వేధింపులకు సంబంధించిన వార్తలు ఒక్కసారి గుప్పుమన్నాయి.

 

 

ఒకరు ప్రారంభించిన ఈ ఉద్యమంలో ఎందరో తమ పై జరిగిన వేదింపులను వరుస పెట్టి చెప్పుకొచ్చారు. ఆయినా సమస్య తీరిందా అంటే ఇంకా బయటకు రాకుండా ఇలాంటి వ్యవహారాలు లోన జరుగుతూనే ఉన్నాయి. అయితే కొంత మంది సిగ్గుతో కానివ్వండి, మోహమాటానికో కానివ్వండి, లేక సినిమా అవకాశాలు రావని కావచ్చూ లేదా తమ సినీ జీవితాన్ని దృష్టిలో పెట్టుకుని బయటకు చెప్పరు. కానీ కొందరు మాత్రం  తాము కాస్టింగ్ కౌచ్ సమస్యలను ఎదుర్కొన్నామంటూ ధైర్యంగా బయటికి చెబుతారు. చెప్పారు కూడా..

 

 

అయితే తాజాగా నటి గుంజన్ కాస్టింగ్ కౌచ్ పై సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈమె హీరోయిన్‌గా తెలుగులో దర్శకుడు కళ్యాణ్ దర్శకత్వం వహించిన వైఫ్.ఐ అనే చిత్రంలో నటిస్తుంది.. ఇక తాను సినిమా ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో చాలామంది దర్శక, నిర్మాతలు కమిట్ మెంట్ అడిగే వారిని, కానీ తాను మాత్రం  డైరెక్ట్ గా కుదరదని చెప్పి వెళ్లిపోయానని చెప్పుకొచ్చింది. ఓ సందర్భంలో ఇలాంటి కమిట్ మెంట్లు ఇవ్వనందున కొన్ని మంచి చిత్రాలను కూడా కోల్పోయానని ఈవిడ తెలిపింది.

 

 

ఇదే కాకుండా మనలో టాలెంట్ లేకుండా అవకాశాల కోసం ఎంతమందితో పడుకున్నా వేస్ట్ అని ఘాటుగా పేర్కొన్నారు గుంజన్.. అలా కాదని కక్కుర్తిపడి అవకాశాల కోసం, టాలెంట్ లేకున్నా, సిగ్గువదిలి పడుకున్న తర్వాత సినిమా అవకాశం వచ్చినా కూడా  ఆ అవకాశాన్ని వారు సక్రమంగా నిలబెట్టు కోలేరని, కాబట్టి టాలెంట్ ని నమ్ముకోవాలి కానీ కమిట్మెంట్ కాదని తెలిపారు హీరోయిన్ గుంజన్..

మరింత సమాచారం తెలుసుకోండి: