సినిమా వాళ్ళకు  జాతకాలు వాస్తు న్యూమరాలజీ పై నమ్మకాలు చాలా ఎక్కువ. ముఖ్యంగా ఒక ఫ్లాప్ ఎదురైన తరువాత ఆ నమ్మకాలు విపరీతంగా పెరిగిపోతాయి. ‘డియర్ కామ్రేడ్’ ఫ్లాప్ తరువాత ఇలాంటి సెంటిమెంట్స్ విజయ్ దేవరకొండకు కూడ ఏర్పడ్డాయి అన్న విషయం ఇప్పుడు లేటెస్ట్ గా వెలుగులోకి వచ్చింది. 

అందరిని ఆశ్చర్య పరుస్తూ ఈ క్రేజి హీరో విజయ్ దేవరకొండ కాస్తా దేవరకొండ విజయ్ సాయి గా మారాడు. వరస పరాజయాలతోసతమతమైపోతున్న విజయ్ లేటెస్ట్ మూవీ 'వరల్డ్ ఫేమస్ లవర్'  టీజర్  టైటిల్ కార్డ్స్ లో దేవరకొండ విజయ్ సాయి అని పేరు వేయడం అందరిని ఆశ్చర్య పరిచింది. వాస్తవానికి ఇదే అతని రియల్ నేమ్ అంటూ ఊహాగానాలు వస్తున్నాయి. 

ఇదిలా ఉంటే పంచ భూతాలు అయిన నీరు నిప్పు గాలి భూమి అనే నాలుగు ప్రకృతి శక్తులను ప్రేరణగా తీసుకుని దర్శకుడు క్రాంతి మాధవ్ విజయ్ కోసం నాలుగు లవ్ స్టోరీలను క్రియేట్ చేసినట్లు నిన్న విడుదలైన ఈ మూవీ టీజర్ ను బట్టి అర్ధం అవుతోంది. కేవలం హీరో పాత్రను మాత్రమే కాకుండా హీరోయిన్స్ పాత్రలను కూడ చాల డిఫరెంట్ గా ఈ మూవీలో క్రాంతి మాధవ్ డిజైన్ చేసాడు అన్న వార్తలు వస్తున్నాయి. 

అయితే ఈ టీజర్ ను చూసిన వారు అప్పుడే నెగిటివ్ కామెంట్స్ మొదలు పెట్టేసారు. విజయ్ ‘అర్జున్ రెడ్డి’ ‘గీతగోవిందం’ సినిమాల ప్రభావం నుంచి ఇంకా బయటకు రాలేకపోతున్నాడు అంటూ అప్పుడే సెటైర్లు మొదలు పెట్టేసారు. విజయ్ లుక్స్ లో ‘అర్జున్ రెడ్డి’ గెటప్ కనిపిస్తూ చివరికి బ్యాక్ గ్రౌండ్ స్కోర్, టీజర్ కటింగ్ విషయంలో కూడా ‘సాహో’ ‘మత్తువదలరా’ లాంటి సినిమాల ఫార్మాట్స్ నే ఫాలో అవ్వడం మరింత విమర్శలకు తావు ఇస్తోంది. ‘డియర్ కామ్రేడ్’ మూవీ ఫెయిల్యూర్ తరువాత వచ్చేనెల ఫిబ్రవరి 14న వ్యాలెంటైన్స్ డే సందర్భంగా ఈ సినిమా విజయ్ కు అత్యంత కీలకం. దీనితో ఈ పేరు మార్పు వల్ల అతడికి ఏమాత్రం కలిసి వస్తుందో చూడాలి..

 

మరింత సమాచారం తెలుసుకోండి: