దర్శకుడుని ‘కెప్టెన్ ఆఫ్ ది షిప్’ అని పిలుస్తూ ఉంటారు. దాసరి నారాయణరావు కాలంలో దర్శకుడి పేరు చూసి ప్రేక్షకులు సినిమాలకు వెళ్ళే పరిస్థితులు ఉండేవి. అయితే ఇప్పుడు పరిస్థితులు మారిపోవడంతో టాప్ హీరోల పేర్లను చూసి ఆ సినిమాలకు ఓపెనింగ్ కలక్షన్స్ వచ్చే పరిస్థితులు ఏర్పడ్డాయి. 

టాప్ హీరోల డామినేషన్ చాల పెరిగి పోయినప్పటికీ రాజమౌళి త్రివిక్రమ్ కొరటాల లాంటి కొందరు దర్శకులు ఇప్పటికీ తమ వ్యక్తిత్వాన్ని కొనసాగించుకో గలుగుతున్నారు. ఇలాంటి పరిస్థితులలో సంక్రాంతి రేసుకు రాబోతున్న ‘అల వైకుంఠపురములో’ మూవీకి సంబంధించి ఒక ధియేటర్ ముందు ఏర్పాటు చేసిన  ఒక భారీ కటౌట్ తో సమానంగా త్రివిక్రమ్  మ్ కటౌట్ ను కూడా పెట్టడం ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది.

వాస్తవానికి దర్శకులకు కటౌట్లు చాల తక్కువగా మనం చూస్తూ ఉంటాం. రాజమౌళి వంటి స్టార్ డైరెక్టర్ కు కూడ దక్కని అరుదైన గౌరవం  ఇప్పడు  త్రివిక్రమ్ కు దక్కిందని ఆయన అభిమానులు ఆనందం వ్యక్త పరుస్తున్నారు. ఈ కట్ అవుట్ కు సంబంధించిన ఫోటోలు మీడియాకు హాట్ టాపిక్ గా మారాయి. 

అయితే తమ స్టైలిస్ట్ స్టార్ అల్లు అర్జున్ తో సమానంగా త్రివిక్రమ్ కటౌట్ ను చూసిన బన్నీ అభిమానులు మాత్రం షాక్ అవుతున్నారు. త్రివిక్రమ్ తన పద్ధతికి భిన్నంగా ‘అల వైకుంఠపురములో’ మూవీ స్క్రిప్ట్ ను బన్నీ ఒత్తిడితో అనేకసార్లు మార్చాడు అన్న రూమర్స్ ఉన్నాయి. దీనికి సమాధానంగా దర్శకుడు కూడ హీరోతో సమానం అనే విధంగా ఇప్పుడు ఏర్పాటు చేయబడ్డ ఈ కటౌట్ ను చూసి త్రివిక్రమ్ అభిమానులు ఆనంద పడుతున్నారు. వాస్తవానికి టాప్ హీరోల సినిమాలు హిట్ అయితే అది హీరోల ఎకౌంట్ లోకి ఫ్లాప్ అయితే అది దర్శకుల ఎకౌంట్ లోకి వెళ్ళిపోయిన పరిస్థితులలో లేటెస్ట్ గా ఏర్పాటు చేయబడ్డ త్రివిక్రమ్ కటౌట్ దర్శకుడి ఆధిపత్యాన్ని సూచిస్తోంది..

 

మరింత సమాచారం తెలుసుకోండి: