అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న అల వైకుంఠపురములో సినిమా సంక్రాంతి పండుగకు విడుదల కాబోతుంది. జనవరి 12వ తేదీన అల వైకుంఠపురములో సినిమాను విడుదల చేస్తామని మొదట మేకర్స్ ప్రకటించినా రిలీజ్ డేట్ మారే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి సినిమాల తరువాత అల్లు అర్జున్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న సినిమా కావడంతో ఈ సినిమాపై అల్లు అర్జున్, త్రివిక్రమ్ అభిమానుల్లో భారీగా అంచనాలున్నాయి. 
 
కానీ ప్రస్తుతం ఒక సెంటిమెంట్ అల్లు అర్జున్ ను, అల వైకుంఠపురములో చిత్ర యూనిట్ ను భయపెడుతోందని తెలుస్తోంది. కొంతమంది టాప్ హీరోలు కొన్ని సెంటిమెంట్లు ఫాలో కాగా మరికొంతమంది స్టార్ హీరోల విషయంలో కొన్ని సెంటిమెంట్ల ఎఫెక్ట్ ఖచ్చితంగా ఉంటోంది. గత రెండు సంవత్సరాలలో సంక్రాంతి పండగకు విడుదలైన మెగా హీరోల సినిమాలు భారీ అంచనాలతో వచ్చి బాక్సాఫీస్ దగ్గర మాత్రం డిజాస్టర్లుగా నిలిచాయి. 
 
2018 సంవత్సరంలో సంక్రాంతి పండుగకు పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో తెరకెక్కిన అజ్ఞాతవాసి సినిమా విడుదలైంది. అజ్ఞాతవాసి సినిమా ఫలితం పవన్ కళ్యాణ్ అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేసింది. పవన్ అభిమానులు ఇప్పటికీ ఈ సినిమా ఫలితం విషయంలో అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉంటారు. గత సంవత్సరం రామ్ చరణ్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన వినయ విధేయ రామ సినిమా విడుదలైంది. 
 
రంగస్థలంలాంటి ఇండస్ట్రీ హిట్ తరువాత రామ్ చరణ్ నటించిన ఈ చిత్రం రామ్ చరణ్ అభిమానులకు కూడా నచ్చలేదు. 2018,2019 సంవత్సరాలలో మెగా హీరోలకు డిజాస్టర్లు వచ్చినా ఈ సంవత్సరం అల్లు అర్జున్ ఆ సెంటిమెంట్ ను బ్రేక్ చేస్తాడని బన్నీ అభిమానులు ఆశిస్తున్నారు. నా పేరు సూర్య సినిమా తరువాత కొంత గ్యాప్ తీసుకున్న అల్లు అర్జున్ పక్కాగా హిట్ కొట్టాలని ఈ సినిమాలో నటించాడు. మరి మెగా హీరోల సంక్రాంతి ఫ్లాప్ సెంటిమెంట్ ను బన్నీ బ్రేక్ చేస్తాడో లేదో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: