తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్...ఈ  పేరుకి తమిళ  ఇండస్ట్రీలోనే కాదు ప్రతి ఇండస్ట్రీలో ఒక రేంజ్ లో క్రేజ్ ఉంది. తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమా కోసం వేచి చూసే అభిమానులు ఎంతో మంది. ఒకసారి ఆయన ఆటిట్యూడ్ చూపిస్తూ  స్టైల్ గా  నడిచాడు అంటే ప్రతి ఒక్క సినీ ప్రేక్షకులు ఫిదా అవ్వాల్సిందే. అద్భుతమైన స్టైల్ కు కేరాఫ్ అడ్రస్ రజినీకాంత్. ఒక సాదాసీదా నటుడిగా చిత్రపరిశ్రమకు పరిచయమైన రజినీకాంత్ అంచలంచలుగా ఎదుగుతూ... సినీ ప్రేక్షకులందరికీ సూపర్ స్టార్ గా మారిపోయాడు. ఇండస్ట్రీ తో సంబంధం లేకుండా భారీ విజయాలను సొంతం చేసుకుంటూ ఉంటారు రజినీకాంత్  అటు తెలుగు అభిమానుల్లో  కూడా ఒక రేంజ్ లో క్రేజ్ ఉంటుంది రజినీకాంత్ కి. 

 

 

 ఇప్పటికే ఎన్నో మంచి సినిమాలతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చే ఎన్నో మంచి విజయాలను సొంతం చేసుకున్న రజనీకాంత్... తాజాగా మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. దర్బార్ సినిమాతో కొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు రజినీకాంత్.కాగా  దర్బార్ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడిన సూపర్ స్టార్ రజినీకాంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమిళ ప్రజలు తనను ఎంతగా ప్రేమిస్తారో అంతే అభిమానాన్ని తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా పంచుతుండటం  తన పూర్వజన్మ సుకృతం అంటూ సూపర్ స్టార్ రజినీకాంత్ చెప్పారు. తెలుగు ప్రజలందరూ సినిమా ప్రియులని రజిని వ్యాఖ్యానించారు. మంచి సినిమాలను తెలుగు ప్రేక్షకులకు ఎప్పుడు ప్రోత్సహిస్తారని తెలిపారు రజినీకాంత్. 

 

 

 రజనీకాంత్ దర్బార్ మూవీని లైకా ప్రొడక్షన్స్ పతాకంపై రాజా సుభాస్కరన్  నిర్మిస్తున్నారు. 1976 సంవత్సరంలో తాను నటించిన అంతులేని కథ సినిమా రిలీజ్ అయింది.. ఆ నాటి నుంచి తెలుగు ప్రేక్షకులు ఇప్పటి వరకు తనను ఆదరిస్తూనే వున్నారు అంటూ చెప్పుకొచ్చారు రజినీకాంత్ . నా సినిమాలైనా పెదరాయుడు,భాష,  నరసింహ,  చంద్రముఖి,  రోబో ఇవన్నీ బాగా ఆడి విజయం సాధించాయి అంటే కేవలం సినిమాలో తాను నటించానని కాదు అని..  సినిమా బాగుంది కాబట్టే తెలుగు ప్రేక్షకులు ఆదరించారు అంటూ రజనీకాంత్ తెలిపారు. చాలా రోజుల తర్వాత దర్బార్ సినిమాలో పోలీస్ పాత్రలో నటించాను అని చెప్పుకొచ్చారు రజినీకాంత్. ఎవరికైనా ఈ కథ చెప్తే నిర్మాత ఈ సినిమాకు ఎలా ఒప్పుకున్నాడా అని అనిపిస్తుంది.. కానీ సినిమాలో  దర్శకుడు మురుగదాస్ స్క్రీన్ ప్లే ఆయన కథ చెప్పిన విధానం ఎంతగానో బాగుంటుంది అంటూ రజనీకాంత్ చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: