గత ఏడాది మెగా హీరో వరుణ్ తేజ్ కు బాగా కలిసొచ్చింది.  అంతరిక్షం పరాజయం తరువాత  గత ఏడాది ఎఫ్ 2 తో ప్రేక్షకులముందుకు వచ్చిన  వరుణ్ కు ఆ చిత్రం  అతనికెరీర్ లో  బిగ్గెస్ట్  బ్లాక్ బాస్టర్ హిట్ గా నిలిచింది. మల్టీ స్టారర్ గా తెరకెక్కిన ఎఫ్  2లో  విక్టరీ వెంకటేష్ మరో హీరోగా నటించగా బాక్సాఫీస్ వద్ద  80కోట్ల వసూళ్లను రాబట్టి అదుర్స్ అనిపించింది.  ఈచిత్రం తరువాత వరుణ్  ఇటీవల  గద్దల కొండ గణేష్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చి మరో హిట్ ను ఖాతాలో వేసుకున్నాడు.  ఈ చిత్రం తో మొదటి సారి ఊర మాస్  పాత్రలో నటించి వరుణ్ తేజ్   ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఇందులో వరుణ్ లుక్ కు కూడా ప్రశంసలు దక్కాయి. 
 
ఇక ఈ చిత్రం తరువాత  వరుణ్ తేజ్ ఈ సారి స్పోర్ట్స్  బ్యాక్ డ్రాప్ లో  చిత్రం చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.  బాక్సింగ్ నేపథ్యం లో తెరకెక్కనున్న ఈ చిత్రానికి  బాక్సర్ అనే టైటిల్ ఖరారు చేశారు.  ఇటీవలే  ఈ చిత్రం లాంచ్ అయ్యింది. ప్రస్తుతం  ప్రీ ప్రొడక్షన్ దశలో వున్న ఈ చిత్రం  అతి త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈ చిత్రం లో కూడా వరుణ్ సరికొత్త లుక్ లో కనిపించనున్నాడు. అందుకు సంబంధించిన  స్టిల్ ను  వరుణ్  తాజాగా సోషల్ మీడియా లో పోస్ట్ చేశాడు.  గుబురు గడ్డం తో  బరువు పెరిగి  బాక్సింగ్ గ్లోవ్స్ తో వరుణ్ ఆ ఫోటోలో  కనిపించాడు. 
 
నూతన దర్శకుడు కిరణ్ కొర్రపాటి  తెరకెక్కించనున్న ఈ  చిత్రంలో  వరుణ్ తేజ్ బాక్సర్  గా కనిపించనున్నాడు.  ప్రముఖ నిర్మాత  అల్లు అరవింద్  పెద్ద కుమారుడు  అల్లు బాబీ  ఈ చిత్రాన్ని నిర్మించనున్నాడు. నిర్మాతగా  ఆయనకు ఇదే మొదటి  సినిమా. తమన్ సంగీతం అందించనున్నాడు. భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: