సాహో సినిమాతో యంగ్ డైరెక్టర్ సుజిత్ కి ఇచ్చిన బూస్టింగ్ ఇచ్చిన ప్రభాస్ మరో న్యూ డైరెక్టర్ కు లిఫ్ట్ ఇస్తానని మాటిచ్చేశాడు. రీసెంట్ గా స్మాల్ మూవీతో అట్రాక్ట్ చేసిన ఓ కొత్త దర్శకుడికి యంగ్ రెబల్ స్టార్ గోల్డెన్ ప్రపోజల్ పెట్టాడు. ఇంతకీ ఎవరా కొత్త దర్శకుడు..?  ప్రభాస్ ఆ న్యూ డైరెక్టర్ కు చేసిన ప్రామీస్ ఏంటో తెలుసా..?


ప్రభాస్ కు ఏదైనా సినిమా నచ్చితే దర్శకుడి ఇమేజ్.. చిన్న సినిమానా పెద్ద సినిమానా పట్టించుకోకుండా ప్రమోట్ చేస్తుంటారు. ముఖ్యంగా తన ఫ్రెండ్స్, రిలేటివ్స్ మూవీస్ అయితే మరింత కేర్ తీసుకుంటాడు. అంతేకాదు సినిమాలు చేయడంలోనూ ప్రభాస్ దర్శకుల క్రేజ్ పట్టించుకోకుండా మాటిచ్చేస్తుంటాడు. ఇప్పుడు ఓ కొత్త దర్శకుడికి కూడా యంగ్ రెబల్ స్టార్ ఇలాంటి మాటివ్వడం విశేషం. 

 

రన్ రాజా రన్ లాంటి చిన్న సినిమా చేసిన దర్సకుడు సుజిత్ కు సాహో లాంటి పాన్ ఇండియా మూవీ చేసే ఛాన్స్ ఇచ్చాడు. సుజిత్ ఆ అవకాశాన్ని ఉపయోగించుకోలేదు వేరే విషయం. అంతేకాదు జిల్ లాంటి యావరేజ్ మూవీ చేసిన దర్శకుడు రాధాకృష్ణకు జాన్ లాంటి ప్రెస్టీజియస్ మూవీ చేసే బంపర్ ఆఫర్ ఇచ్చాడు. ఇప్పుడు మత్తు వదలరా దర్శకుడికి సైతం ప్రభాస్ అదిరిపోయే ప్రపోజల్ పెట్టాడు. 

 


కీరవాణి కొడుకు శ్రీ సింహ హీరోగా నటించిన మత్తు వదలరా ఇటీవలే రిలీజైంది. రితీష్ రానా దర్శకత్వం వహించిన ఈ సినిమా పాటిజివ్ టాక్ తెచ్చుకుంది. సినిమాకు బూస్టింగ్ ఇచ్చే క్రమంలో ప్రభాస్ మత్తువదలరా టీంను ఇంటర్వ్యూ చేశాడు. రితీష్ రానా డైరెక్షన్ కు ఇంప్రెస్ అయిన ప్రభాస్. నీ దగ్గర కథ ఉంటే నాతో సినిమా చేస్తావా అంటూ అడిగాడు. ప్రభాస్ ప్రపోజల్ కు డెబ్యూ డైరెక్టర్ ఉబ్బితబ్బిబ్బయిపోయాడు. మరి ఫ్యూచర్ లో యంగ్ డైరెక్టర్ కు నిజంగానే ఛాన్స్ ఇస్తాడేమో చూడాలి. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: