'బాహుబలి' వంటి ప్రపంచ స్థాయి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'RRR' సినిమాపై దేశవ్యాప్తంగా తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినిమా ప్రేమికులు సినిమా రిలీజ్ విషయంలో చాలా ఉత్కంఠభరితంగా ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా అభిమానులు మరియు నందమూరి అభిమానులు మొట్టమొదటిసారి తమ అభిమాన హీరోలు కలిసి నటిస్తున్న నేపథ్యంలో 'RRR' సినిమాపై అంచనాలు విపరీతంగా పెట్టుకున్నారు. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ దాదాపు ఇప్పటి వరకు 70 నుండి 80 శాతం పూర్తయినట్లు కేవలం జూనియర్ ఎన్టీఆర్ క్యారెక్టర్ కి సంబంధించిన మాత్రమే బ్యాలెన్స్ ఉన్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వినబడుతున్నాయి.

 

సినిమాలో స్వాతంత్ర సమరయోధులు గా అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్ మరియు కొమరం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ నటిస్తున్న విషయం అందరికీ తెలిసినదే. అయితే తాజాగా ఈ సినిమాలో ఎన్టీఆర్ గెటప్ గురించి ఫిలిం నగర్ లో లేటెస్ట్ గా ఒక వార్త బయటపడింది. అదేమిటంటే సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ బట్టతల గెటప్ లో కనిపించనున్నట్లు గిరిజన వీరుడు కొమరం భీమ్ కాబట్టి అదే తరహాలో షార్ట్ హెయిర్ గాని లేకపోతే బట్టతల పాత్రలో గాని జూనియర్ ఎన్టీఆర్ గెటప్ ఉండబోతున్నట్లు ఇండస్ట్రీలో సరికొత్తగా వార్త వినబడుతుంది.

 

ముఖ్యంగా 'RRR' సినిమాలో ఎక్కువ యాక్షన్ కంటే రాజమౌళి సరికొత్తగా రొమాన్స్ వైపు తన డైరెక్షన్ కొత్త పంథాలో ఈ సినిమాలో చూపించబోతున్న ట్లు ఇండస్ట్రీ టాక్. ఈ నేపథ్యంలో రామ్ చరణ్ పక్కన హీరోయిన్ పాత్రలో బాలీవుడ్ ముద్దుగుమ్మ ఆలియా భట్ నటిస్తుండగా వెంకయ్య ఎన్టీఆర్ పక్కన హాలీవుడ్ ముద్దుగుమ్మ ఒలీవియా మోరిస్ నటిస్తోంది. ప్రస్తుతం ఎన్టీఆర్ మరియు ఒలీవియా మోరిస్ లతో మిగిలి ఉన్న బ్యాలెన్స్ షూటింగ్ రాజమౌళి కంప్లీట్ చేసే ఆలోచనలో ఉన్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వినబడుతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: