గత పదేళ్ళలో సూపర్ స్టార్ మహేష్ బాబు గ్రాఫ్ అనేది అమాంతం పెరిగిపోయింది. కొన్ని సినిమాలు ఫ్లాప్ అయినా సరే కొట్టిన హిట్ లు మాత్రం టాలివుడ్ లో భారీ వసూళ్లు సాధించిన సినిమాలుగా నిలిచాయి. ఆగడు, వన్, స్పైడర్, బ్రహ్మోత్సవం సినిమాలు ఫ్లాప్ అయినా సరే, దూకుడు, శ్రీమంతుడు, భరత్ అను నేను, మహర్షి సినిమాలు భారి విజయాలు సాధించాయి. వసూళ్ళ పరంగా కూడా ఈ సినిమాలు భారీ విజయాన్నే సాధించాయి. ఈ సినిమాలతో మహేష్ బాబు తాను ఒక జోనర్ కే పరిమితం కాలేదని నిరూపించాడు.

 

అయితే ఈ సినిమాలు అన్ని కూడా భారీ వసూళ్లు సాధించడంతో మహేష్ బాబు కమర్షియల్ గా మారిపోయాడని అంటున్నారు టాలివుడ్ నిర్మాత ఒకరు. మహేష్ బాబు తో సినిమా చేయడానికి గాను సదరు నిర్మాత కొన్ని రోజుల క్రితం సంప్రదించారు. అ సమయంలో ఆయనకు మహేష్ బాబు అనేక షరతులు పెట్టినట్టు సమాచార౦. సినిమా విడుదలకు ముందు మార్కెట్ తనకే ఇవ్వడంతో పాటుగా సినిమా విడుదల అయిన తర్వాత వసూళ్ళలో వాటా కూడా అడిగినట్టు సమాచారం.

 

అలాగే నిర్మాతగా కూడా తాను ఉంటాను అని మహేష్ చెప్పాడట. అలాగే దర్శకుడి పారితోషకం తో తనకు సంబంధం లేదని, నిర్మాత అయినా సరే కొంత వరకు మాత్రమే తాను పరిమితం అని చెప్పడంతో ఒక నిర్మాతకు చుక్కలు కనిపించాయి. దీనితో మహేష్ బాబు ఇంత కమర్షియల్ గా మారిపోయాడా అంటూ ఆ నిర్మాత కొందరి వద్ద వ్యాఖ్యానించినట్టు సమాచారం. అన్ని అనుకున్నట్టు జరిగితే వాళ్ళ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకి వచ్చేదని టాలివుడ్ వర్గాలు కూడా అంటున్నాయి. కాగా, ప్ర‌స్తుతం మ‌హేష్ సరిలేరు నీకెవ్వరుతో బిజీగా ఉన్నాడు. అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా విడుద‌ల అవ్వ‌నుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: