టాలీవుడ్ లో కన్నడ హీరోలు ఎంతో మంది వచ్చారు.. కానీ ఎవరూ పెద్దగా పేరు మాత్రం సంపాదించలేకపోయారు.  మెగాస్టార్ చిరంజీవి తో ఢీ అంటే ఢీ అనే పాత్రలో కన్నడ ప్రభాకర్ కి మాత్రం మంచి పేరు వచ్చింది. అదే సమయంలో మరికొంత మంది కన్నడ నటులు వచ్చినా పెద్దగా పేరు సంపాదించుకోలేకపోయారు.  ఇక దర్శకుడిగా తన సినీ జీవితం ప్రారంభించినప్పటికీ నటుడిగా, కథా రచయితగా, పాటల రచయితగా, సంగీత దర్శకుడిగా, పథ్య గాయకుడిగా తన సత్తా చాటుతూ విభిన్నమైన సినిమాలు తీస్తు తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సంపాదించారు ఉపేంద్ర.  ఆర్. చంద్రు దర్శకత్వంలో ఉపేంద్ర హీరోగా రూపొందిన ఐ లవ్ యు మూవీ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే.  

 

తాజాగా కబ్జ అనే భారీ బడ్జెట్ మూవీ చేస్తున్నాడు.  సక్సెస్ ఫుల్ కాంబినేషన్ తో రూపొందుతున్న కబ్జ మూవీ పై కూడా ప్రేక్షకులలో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మూవీ లో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ‘కబ్జా’ లో  ఏడుగురు విల‌న్స్ ఉండేలా ప్లాన్ చేసుకుంటున్న‌ట్టు ఇటీవ‌ల వార్త‌లు వ‌చ్చాయి. బాలీవుడ్‌కు చెందిన నానా పటేకర్‌, మనోజ్‌ బాజ్‌పాయ్‌, ప్రకాశ్‌రాజ్‌, జ‌గ‌ప‌తి బాబు, జ‌య‌ప్ర‌కాశ్ రెడ్డి , ప్ర‌దీప్ రావ‌త్‌, స‌ముద్ర‌ఖ‌నిల‌ని విల‌న్స్‌గా ఎంపిక చేసుకున్న‌ట్టు స‌మాచారం. గ్యాంగ్‌స్టర్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కనున్న ఈ సినిమా దర్శకుడు చంద్రు తెరకెక్కిస్తున్నారు.

 

ఈ రోజు నుంచి చిత్ర షూటింగ్ ప్రారంభం కానుండగా, మూవీలో ఉపేంద్ర లుక్ విడుదల చేశారు మేకర్స్. ఉపేంద్ర లుక్ అభిమానులని ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఇటీవల గ్యాంగ్ స్టర్ నేపథ్యంలో యష్ హీరోగా వచ్చిన ‘కేజీఎఫ్’ పాన్ ఇండియా మూవీగా మంచి పేరు సంపాదించింది.  అండర్ వరల్డ్ నేపథ్యం లో రూపొందనున్న మాస్ ఎంటర్ టైనర్ కబ్జ మూవీ 7 భాషలలో రిలీజ్ కానుంది.  మరి ఈ మూవీతో ఉపేంద్ర ఏం మాయ చేయనున్నాడో అని ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: