పెళ్లిచూపులు సినిమాతో హీరోగా మారిన విజయ్ దేవరకొండ, అంతకముందు పలు సినిమాల్లో అక్కడక్కడా చిన్న పాత్రల్లో నటించి మెప్పించాడు. తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన పెళ్లిచూపులులో మంచి యాక్టింగ్ టాలెంట్ తో ప్రేక్షకులను అలరించిన విజయ్, ఆ సినిమా హిట్ తో మంచి పేరు దక్కించుకున్నాడు. ఇక ఆ తరువాత అర్జున్ రెడ్డి సినిమాలో బోల్డ్ గా యాక్టింగ్ చేసి యువతలో మంచి క్రేజ్ సంపాదించిన విజయ్, ఆ తరువాత పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన గీత గోవిందం సూపర్ హిట్ తో టాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకడిగా ఎదిగాడు. 

 

అయితే ఇటీవల విజయ్ నటించిన సినిమాలు వరుసగా ఫెయిల్ అవుతుండడంతో, ప్రస్తుతం క్రాంతి మాధవ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా పైన మరింత దృష్టిని పెట్టాడు. ఒక యునిక్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రాశి ఖన్నా, ఐశ్వర్య రాజేష్, క్యాథరీన్, ఇజబెల్లె హీరోయిన్స్ గా నటిస్తుండగా, క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ పై ఈ సినిమాని కేఏ వల్లభ నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి స్పందనను రాబట్టడం జరిగింది. అయితే ఈ టీజర్ ని బట్టి చూస్తుంటే, ఒకింత అర్జున్ రెడ్డి ఛాయలు కనపడుతున్నాయని, 

 

అలానే ఆ సినిమాలో ఒక హీరోయిన్ తో రొమాన్స్ చేసిన విజయ్, ఈ సినిమాలో ఏకంగా నలుగురు హీరోయిన్స్ ఉండడంతో, మరింతగా రొమాన్స్ ని ఇరగదీసి ఉంటాడని కొంత ఫన్నీ గా ఫొటోస్ పెడుతూ సోషల్ మీడియా మాధ్యమాల్లో ట్రోల్స్ చేస్తున్నారు. కాగా ఈ టీజర్ ప్రస్తుతం 6 మిలియన్లకు పైగా వ్యూస్ తో 250కె కి పైగా లైక్స్ తో యూట్యూబ్ లో దూసుకుపోతుండడం విశేషం. లవర్స్ డే కానుకగా ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ఎంత మేర సక్సెస్ ని అందుకుంటుందో చూడాలి.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: