‘సోగ్గాడు’ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమా తర్వాత ఇప్పటివరకు టాలీవుడ్ ఇండస్ట్రీ కింగ్ నాగార్జున మరొక విషయాన్ని సాధించలేకపోయారు. చేసిన సినిమాలు అన్ని 'సోగ్గాడు' తర్వాత టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడటం జరిగాయి. మరోపక్క చిన్న కొడుకు అక్కినేని అఖిల్ హీరోగా టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి ఇప్పటి వరకు సరైన విజయాన్ని దక్కించుకొని నేపథ్యంలో అక్కినేని అభిమానులు నిరాశ గా ఉంటున్న తరుణంలో కేవలం పెద్ద కొడుకు అక్కినేని నాగచైతన్య వరుస విజయాలతో దూసుకెళ్లి పోతున్నాడు.

 

తన కెరీర్ విషయంలో చాలా జాగ్రత్తగా అడుగులు వేసుకుంటూ సక్సెస్ఫుల్ జర్నీ సాగిస్తున్న పెద్ద కొడుకు నాగచైతన్య కోసం నాగార్జున తాజాగా సూపర్ ప్లాన్ వేసినట్లు వెంకీ మామ సినిమాల్లో తన సొంత మేనమామ విక్టరీ వెంకటేష్ తో నటించి అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకోవడంతో వెంకీ మామ బ్లాక్ బస్టర్ వేడుకలు చేసే ఆలోచనలో నాగార్జున ఉన్నట్లు టాలీవుడ్ ఇండస్ట్రీలో వార్తలు వినపడుతున్నాయి.

 

వాస్తవంగా వెంకీ - నాగచైతన్య ఇద్దరూ వాస్తవ జీవితంలో మాదిరిగానే సినిమాలో కూడా మామాఅల్లుళ్లుగా నటించడం జరిగింది. మంచి కథతో ఎక్కువ కామెడీ ట్రాక్ ఉన్న వెంకీ మామ సినిమా ఇటీవలే రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ విజయాన్ని సొంతం చేసుకుంది. కమర్షియల్ రూపంలో ఎమోషనల్ ఫ్యామిలీ టచ్ కథతో టాలీవుడ్ ప్రేక్షకుల మధ్యకు వచ్చి నా 'వెంకీ మామ' సినిమా బాక్సాఫీస్ దగ్గర బీభత్సమైన కలెక్షన్లు రావడంతో ఇప్పటికే రిలీజ్ అయిన 21 రోజులు ముగిసేసరికి ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 38 కోట్ల వరకు కలెక్షన్లు రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్న తరుణంలో తన పెద్ద కొడుకు కి వచ్చిన సక్సెస్ బట్టి అక్కినేని మరియు దగ్గుబాటి కుటుంబ సభ్యులను దగ్గరకు చేర్చి నాగార్జున 'వెంకీ మామ' బ్లాక్ బస్టర్ వేడుకలు భారీ ఎత్తున చేసే ఆలోచనలో ఉన్నట్లు టాలీవుడ్ ఇండస్ట్రీలో వార్తలు వినబడుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: