ప్రస్తుతం సినీ పరిశ్రమలో సూపర్ హిట్ సాధించిన ఏ మూవీ అయినా వెంటనే రిమేక్ కి సిద్దమవుతున్నారు.  టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ ఇలా అన్ని సినీ పరిశ్రమలో ఇదే సాంప్రదాయం కొనసాగుతుంది.  గతంలో కూడా టాప్ హిరోలు నటించిన మంచి సినిమాలు ఇతర భాషల్లో రిమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. కానీ ఇలీవల కాలంలో ఈ రిమేక్ మూవీస్ ఎక్కువగా చేస్తున్నారు.  అయితే ఆ భాషలో హిట్ అయిన మూవీస్ మరో భాషలో హిట్ అవ్వడం కాకపోవడం వేరే విషయం.  తాజాగా కోలీవుడ్ లో స్టార్ హీరో విజయ్ నటించిన ‘తెరీ’ మూవీ బాక్సాఫీస్ హిట్ గా నిలిచింది.  ఈ మూవీలో విజయ్ పోలీస్ ఆఫీసర్ గా నటించాడు. తెలుగు లో కూడా  ఈమూవీ పోలీస్ గా డబ్బింగ్ అయ్యింది.  అయితే ఈ మూవీని కొన్ని మార్పులు చేర్పులు చేసి తెలుగు లో రిమేక్ చేయాలని అనుకున్నారు.

 

 తాజాగా ఈ విషయం గురించి బెల్లంకొండ శ్రీనివాస్ తన పుట్టిన రోజు సందర్భంగా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.  ఆ మద్య కందిరీగ ఫేం సంతోష్‌ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం సిక్స్‌ ప్యాక్‌తో రెడీ అయ్యాడు. వాస్తవానికి ఈ తమిళ సూపర్‌ హిట్ తెరీ సినిమాను రీమేక్‌ చేయాలని భావించారు. ఆ ప్రాజెక్ట్ వర్క్‌ అవుట్ కాకపోవటంతో కొత్త కథతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్టుగా వెల్లడించాడు.  అయితే అప్పట్లో తెరీ మూవీ మంచి సక్సెస్ సాధించడంతో  తెలుగులో పవన్‌ కళ్యాణ్‌ హీరోగా రీమేక్‌ చేసేందుకు ప్రయత్నాలు జరిగాయి.

 

ముందుగా పవన్‌ తెరీ రీమేక్‌కు ఓకే చెప్పిన తరువాత ఆ ప్రాజెక్ట్‌ నుంచి తప్పుకున్నాడు. ఆ తర్వాత బెల్లంకొండ సురేష్‌ బ్యానర్‌లో మాస్ మహరాజ రవితేజతో ఈ మూవీ తీయాలని బావించారట.. కానీ పలు కారణాల వల్ల అది కూడా క్యాన్సల్ అయ్యిందట.  చివరికి ఈ మూవీ బెల్లంకొండ శ్రీనివాస్ తో కంటిన్యూ చేయాలని భావించారట.. కానీ ఇప్పుడు ఇలాంటి రిమేక్ చేయడం వల్ల ప్రయోజనం ఉంటుందా లేదా అన్న సందిగ్దంలో పడటంతో..  తరువాత తెరీ రీమేక్‌ను పూర్తిగా పక్కన పెట్టేశారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: