సినిమా రంగంలో నటించే ప్రతి పదిమందిలో ఒకరిద్దరికో ఒకప్పుడు దాదాపుగా సైడ్ బిజినెస్‌లు ఉండేవి. అది అప్పటి మాట కాని ఇప్పుడు ఒకటి రెండు హిట్ సినిమాలు పడగానే చాలా తెలివిగా ఆలోచించి నటీనటులు పక్కన మరో బిజినెస్‌ను స్టార్ట్ చేస్తున్నారు. ఇలా ఇప్పటికి చాలా మంది తమకు అనువైన రంగంలోకి ప్రవేశించి విజయవంతంగా ముందుకెళ్లుతున్నారు. ఇకపోతే ఇప్పుడు తాజాగా అలీ కూడా నిర్మాణరంగంలోకి ప్రవేశించాడనే వార్త ఒక్క సారిగా గుప్పుమంటుంది.

 

 

ఇక ఎప్పుడో చిన్నప్పుడు ఆర్టిస్ట్ గా తన కెరియర్ ప్రారంభించిన అలీ   టాలీవుడ్ లో కమెడియన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్నాడు.. ఇప్పటి వరకు వందల చిత్రాలలో నటించిన అలీ ఇప్పటికి స్టార్ కమెడియన్ గానే కొనసాగుతున్నాడు. ఇదే కాకుండా టాలీవుడ్ లోని దర్శకులు చేసే స్టార్ హీరోల చిత్రాలలో ఆలీ కోసం కచ్చితంగా పాత్రలు సృష్టిస్తూ ఉంటారు. ఇక చిన్న పెద్ద అని తేడా లేకుండా తన పాత్ర పరిధి మేరకు చేసుకుంటూ వెళ్తున్న అలీకి ఓ విధంగా అవకాశాలు కొదవలేదని చెప్పాలి.

 

 

ఈ మద్య టీవీ షోల్లో కూడా జిగేల్ మంటూ తన మెరుపులు మెరిపిస్తున్న ఆలీకి ఎలాంటి లోటు లేదనిపిస్తుంది. ఇక ఈ మధ్యకాలంలో వెబ్ సిరిస్ లకి భాగా డిమాండ్ పెరిగింది.  భవిష్యత్తు మొత్తం వెబ్ సిరిస్ ల యుగం నడుస్తుంది. అందుకే ఈ విషయాన్ని పసిగట్టిన అలీ తాజాగా నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టి ప్రొడక్షన్ హౌస్ ని స్టార్ట్ చేశాడు. ఇకపోతే తన ప్రొడక్షన్ హౌస్ నుంచి వెబ్ సిరిస్ లు, రియాలిటీ షోలు నిర్మించడం జరుగుతుందని ఈ సందర్భంగా అలీ చెప్పుకొచ్చారు.

 

 

ఇక ప్రొడక్షన్ హౌస్ ని క్రియేటివ్ గా తన పేరు కలిసి వచ్చేలా అలీవుడ్ ఎంటర్టైన్మెంట్స్ అని పెట్టారు. ఇకపోతే దీనికి సంబందించిన లోగో రిలీజ్ వేడుకకు దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి, నిర్మాత అచ్చిరెడ్డి, సంగీత దర్శకురాలు శ్రీలేఖ వంటి ప్రముఖులు హాజరయ్యారు. మరి అలీ ప్రొడక్షన్ హౌస్ నుంచి భవిష్యత్తులో ఎలాంటి వెబ్ సిరిస్ లు వస్తాయి అనేది ఇప్పుడు సినీరంగంలో చాలా ఆసక్తికరంగా మారింది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: