2019 బాలయ్య కి పెద్ద అనుభవాన్ని అనుభూతులని మిగిలిచింది. ఆ సంవత్సరంలో వచ్చిన సినిమాలన్ని బాలయ్యకి మంచి మెమరీస్ ని ఇచ్చాయి. బాలయ్య తండ్రి సీనియర్ ఎన్.టి.ఆర్ బయోపిక్ గా తెరకెక్కిన ఎన్.టి.ఆర్ మహానాయకుడు..కథానాయకుడు సినిమాలు ఘోరంగా పరాజయాన్ని మూటగట్టుకున్నాయి. తమిళ దర్శకుడితో తీసిన జై సింహ కూడా ఫ్లాప్ కిందే లెక్క. కాని హిట్ అని చెప్పుకున్నారు. అందుకే బాలయ్య మళ్ళీ ఆ దర్శకుడితోనే కమిటయ్యాడు. అసలు రూలర్ అని టైటిల్ ఫిక్స్ చేసినప్పటి నుంచి బాలయ్య ఫ్యాన్స్ చేసిన హంగామా అంతా ఇంతా కాదు.

 

కానీ ఎప్పుడైతే రూలర్ కి సంబంధించి లుక్స్ రిలీజ్ చేశారో ఇక చూడండి నెటిజన్స్ మామూలుగా ట్రోల్ చేయలేదు. అంతేకాదు బాలయ్య ఫ్యాన్స్ కి కూడా బాగా డిసప్పాయింట్ చేశాయి. దాంతో సినిమాపై నెగిటివ్ ఇంపాక్ట్ బాగా పడింది. ఇక సినిమా రిలీజైయ్యాక ఫ్లాప్ టాక్ రాగానే మొత్తానికి గట్టి షాక్ తగిలింది. దాంతో నెక్స్ట్ బాలయ్య-బోయపాటి కాంబినేషన్ లో వచ్చే సినిమా మీద ఎఫెక్ట్ బాగా పడింది. అంతేకాదు హీరోయిన్స్ కూడా బాలయ్య సినిమా అంటే మళ్ళీ మాట్లాడటం లేదట. 

 

మిల్కీ బ్యూటీ తమన్నా గురించి తెలిసిందే. బాహుబలి అవంతికగా గుర్తింపు వచ్చినప్పటికి తర్వాత అవకాశాలు మాత్రం రాలేదు. కొఒంతకాలంగా కోలీవుడ్ లోనే అలా అలా నెట్టుకొస్తుంది. ఇక తెలుగులో వచ్చిన కొన్ని అవకాశాలు తమన్నాకి కాస్త కలిసొచ్చాయని చెప్పాలి. ఇటీవలే సైరా నరసింహా రెడ్డి లాంటి పాన్ ఇండియా సినిమాలో అద్భుతమైన అవకాశం అందుకుంది. అంతేకాదు కోలీవుడ్ లో విశాల్ హీరొగా వచ్చిన యాక్షన్ సినిమాలోనూ అదరగొట్టింది. ఇండస్ట్రీ స్టార్ హీరోలందరి సరసన అవకాశాలు అందుకున్న మిల్కీకి ఇటూవల నందమూరి బాలకృష్ణ సరసన బోయపాటి సినిమాలో నటించే అవకాశం దక్కిందట. అయితే ఈ ఆఫర్ ని మిల్కీ సున్నితంగా తిరస్కరించిందని తెలుస్తోంది. అయితే బాలయ్య సినిమాను రిజక్ట్ చేసేంత బిజీగా ఉందా? అని ఆలోచిస్తే తమన్నా చేతిలో పెద్ద సినిమాలేవీ లేవు.

 

ప్రస్తుతం గోపిచంద్ సరసన 'సీటీ మార్' అనే సినిమా తప్ప టాలీవుడ్ లో మరే సినిమాలో నటించడం లేదు. ఇక బాలీవుడ్ లో బోలే చుడియాన్ అనే సినిమాలో నటిస్తోంది. దటీజ్ మహాలక్ష్మి రిలీజ్ కి రావాల్సి ఉంది. అయితే తమన్నా అంత పెద్ద ఆఫర్ వస్తే రిజక్ట్ చేసేంత బిజీగా మాత్రం లేదు. ఇక బాలయ్య- బోయపాటి లాంటి క్రేజీ కాంబోనే కాదని అనుకుంది అంటే ఇంకేదైనా బలమైన రీజన్ ఉందేమో మరి. అయితే ఫిల్మ్ నగర్ లో మాత్రం ఇంకో మాట వినిపిస్తోంది. బాలయ్య సినిమా అనగానే తమన్నా ఏం చెప్పాలో తోచక సైలెంట్ గా ఉండిపోయిందట. అందుకు కారణం రూలర్ అని అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: