సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వచ్చిన అర్జున్ రెడ్డి సినిమా సూపర్ డూపర్ హిట్ కావడంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ ట్రెండ్ సెట్టర్ సినిమాగా హిస్టరీ క్రియేట్ చేయడంతో విజయ్ దేవరకొండ సోషల్ మీడియాలో అప్పటి క్రేజ్ బట్టి మరిచిపోయి నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ తన అభిప్రాయాన్ని ముక్కుసూటిగా చెబుతూ కొంచెం అతిగా చేయడం జరిగింది. దీంతో విజయ్ దేవరకొండ డౌన్ ఫాల్ ఎపుడు వస్తదా అని యాంటీ ఫ్యాన్స్ ఎప్పటినుండో వెయిట్ చేయడం మొదలుపెట్టారు. అయితే ఇటీవల వరుసగా విజయ్ దేవరకొండ చేసిన సినిమాలు దారుణంగా బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడటంతో ఇంకా విజయ్ దేవరకొండ యాంటీ ఫ్యాన్స్ ఇదే టైం అనుకుని రెచ్చిపోతున్నారు.

 

తాజాగా క్రాంతిమాధవ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటించిన 'వరల్డ్ ఫేమస్ లవర్' సినిమా టీజర్ రావడంతో సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో విజయ్ దేవరకొండ పై ట్రోలింగ్ చేయడం మొదలుపెట్టారు. అంతేకాకుండా  సెక్స్, సిగరెట్, మందు లాంటి ఎలిమెంట్స్ దాటి ముందుకు రాలేవా అంటూ విజయ్ దేవరకొండపై కామెంట్స్ చేస్తున్నారు. టీజర్ లో భాగంగా ఓ సన్నివేశంలో విజయ్ దేవరకొండ పళ్ళు తోముకుంటే కాజల్ వచ్చి మీ టూత్ పేస్ట్ లో ఉప్పుందా అని అడుగుతుంది. విజయ్ దేవరకొండ సీరియస్ గా చూస్తుంటే.. పక్కనే బాలయ్య ఫొటో పెట్టి "మామా ఏక్ పెగ్ లా" అనే కామెంట్స్ పెడుతున్నారు.

 

ఇలాంటి ఎన్నో ఫన్నీ పోస్టులతో విజయ్ దేవరకొండ ని సోషల్ మీడియాలో యాంటీ ఫ్యాన్స్ ఒక ఆట ఆడుకుంటున్నారు. అంతేకాకుండా విజయ్ దేవరకొండ యాక్టింగ్ లో కొత్తదనం లేదని మేనరిజమ్స్ విషయంలో ఇండస్ట్రీలో ఉన్న సీనియర్ హీరోలు సినిమా సినిమాకి చేంజ్ చేస్తున్న గాని విజయ్ దేవరకొండ అవే మేనరిజమ్స్ తో కెరియర్ కొనసాగిస్తున్నారని విమర్శించారు. మొత్తంమీద చూసుకుంటే దొరక్క దొరక్క దొరికిన విజయ్ దేవరకొండ 'వరల్డ్ ఫేమస్ లవర్' టీజర్ పై యాంటీ ఫ్యాన్స్ ఓ రేంజ్ లో రెచ్చిపోయి ట్రోలింగ్ చేశారు.  

 

మరింత సమాచారం తెలుసుకోండి: