బాలీవుడ్ సినిమా పరిశ్రమకు కింగ్ ఖాన్ షారుఖ్ సరసన ఓం శాంతి ఓం అనే సినిమాతో నటిగా ఎంట్రీ ఇచ్చిన దీపికా పడుకొనే, తొలి సినిమాతోనే మంచి సక్సెస్ ని తన ఖాతాలో వేసుకుంది. ఇక ఆ తరువాత వరుసగా సినిమా అవకాశాలతో ముందుకు సాగిన దీపికకు వెంటవెంటనే పలువురు స్టార్ హీరోల సరసన సినిమా అవకాశాలు లభించాయి. అయితే తనకు వచ్చిన అవకాశాలను జాగ్రత్తగా వినియోగించుకుంటూ, వాటిని విజయాలుగా మలుచుకుంటూ ముందుకు సాగిన దీపికా, బాలీవుడ్ సినిమా పరిశ్రమలో అనతికాలంలోనే అగ్ర కథానాయికగా మంచి పేరు గడించింది. అంతటితో ఆగకుండా, ఇటీవల హాలీవుడ్ లో వచ్చిన ట్రిపుల్ ఎక్స్ రీసెంట్ మూవీ లో కూడా ఒక హీరోయిన్ గా నటించి మెప్పించింది. 

 

ఇకపోతే గత ఏడాది బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ ని ప్రేమించి మరీ వివాహమాడిన దీపికా, ఇప్పటికీ కూడా సినిమాల్లో నటిగా కొనసాగుతూ ఉంది. ఇక అతి త్వరలో రిలీజ్ కానున్న చపక్ అనే సినిమాలో కూడా ప్రధాన పాత్రలో నటిస్తున్న దీపికా, నిన్న తన పుట్టినరోజు వేడుకలను పలువురు అతిథుల సమక్షంలో ఎంతో వైభవంగా చేసుకుంది. పెళ్లి అనంతరం ఆమె జరుపుకున్న తొలి బర్త్ డే కు భర్త రణ్వీర్ సహా పలువురు బాలీవుడ్ ప్రముఖులు, ఆమె ఫ్యాన్స్ నుండి ఆమెకు బర్త్ డే విషెస్ లభించగా, కొందరు నెటిజన్లు మాత్రం ఆమె వేసుకున్న బర్త్ డే డ్రెస్ పై కొద్దిపాటి విమర్శలు చేస్తున్నారు. ఎప్పుడూ షూటింగుల్లో, అలానే ఇంట్లో బిజీగా ఉండే దీపికా వంటి పేరున్న నటీమణులు, 

 

సంవత్సరానికి ఒక్కసారి వచ్చే పుట్టినరోజు వేడుకకు, ఇలా అర్ధ నగ్నంగా డ్రెస్ వేసుకోవడం సరైనది కాదని అంటూ పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో కామెంట్స్ చేస్తున్నారు. ఇక నిన్న జరిగిన దీపికా బర్త్ డే వేడుకల్లో ఆమె స్లీవ్ లెస్ టాప్ తో పాటు లోపలి యద అందాలు కనపడేలా టైట్ గా దుస్తులు ధరించడంతో, మేడం మీకు పెళ్లి అయింది కదా, అయినా కూడా ఇటువంటి ముఖ్యమైన వేడుకలకు సంప్రదాయబద్దంగా దుస్తులు వేసుకువస్తే బాగుండేది అంటూ కామెంట్స్ చేస్తున్న వారు కూడా ఉన్నారు. అయితే కొందరు దీపికా ఫ్యాన్స్ మాత్రం, హీరోయిన్స్ పర్సనల్ లైఫ్ గురించి మనం మాట్లాడడం తగదని, వారికి కూడా సొంతంగా ఇష్టాలు ఉంటాయి అనేది మనం మరిచిపోకూడదని అంటున్నారు....!!

మరింత సమాచారం తెలుసుకోండి: