టాలీవుడ్ లో ఇప్పుడున్న నిర్మాతల్లో వన్ ఆఫ్ ది బిగ్ ప్రొడ్యూసర్ గా దిల్ రాజు చలామణి అవుతున్నారు. ఇది వాస్తవం కూడా. దిల్ రాజు కేవలం నంబర్ వన్ ప్రొడ్యూసరే కాదు నంబర్ వన్ డిస్ట్రిబ్యూటర్ కూడా. ఇక తనది లక్కీ హ్యాండ్ అని కూడా మన తెలుగు ఇండస్ట్రీలో చాలామంది అంటుంటారు. అందుకే తమ పిల్లాలని రాజు బ్యానర్ ద్వారా లాంచ్ చేయాలని ఆసక్తి చూపిస్తుంటారు. ఇక ఇప్పుడు రాబోతున్న సంక్రాంతి సినిమాలన్నీ దిల్ రాజువే. కొన్నింటికి డిస్ట్రిబ్యూషన్, మరో సినిమాకు సహ-నిర్మాత కూడా. ఇంకా చెప్పాలంటే సంక్రాంతి సినిమాలన్నీ దిల్ రాజు చుట్టూనే తిరుగుతున్నాయి. ఇలాంటి టైమ్ లో రెండు పెద్ద సినిమాల హీరోలు మొడిగా వ్యవహరిస్తున్నారు. నా సినిమాకే అంటే నా సినిమాకే ఎక్కువ థియేటర్లు కావాలంటూ డిమాండ్ చేశారు. ముందు నా సినిమా రిలీజ్ చేస్తా అంటే లేదు ముందు నా సినిమా రిలీజ్ చేస్తా అంటూ బయటకు కనపడకుండా కీచులాడుకుంటున్నారు. దీంతో ఎవరికీ సర్ధి చెప్పలేక రాజు అల్లాడిపోతున్నాడు పాపం. 

 

అయితే హీరోల ఇగోల మధ్య తన కోట్ల రూపాయల డబ్బును ఎందుకు ఫణంగా పెట్టాలనే కోపం, ఆవేదన దిల్ రాజుకు కూడా ఉందని తాజాగా ఒక మాట వినిపిస్తోంది. కానీ ఇక్కడ పెద్ద హీరోలతో వ్యవహారం. అందుకే అటు మింగలేడు, ఇటు కక్కలేడు. అందుకే రీసెంట్‌గా జరిగిన ప్రెస్ మీట్ లో అసలు కారణాలేంటనేది ఒక్క మాట కూడా బయటకు చెప్పలేకపోయాడు. కానీ ప్రెస్ మీట్ పూర్తయిన తర్వాత ఇదే టాపిక్ ను కొనసాగిస్తూ, ఇద్దరు ముగ్గురు మీడియా మిత్రులతో దిల్ రాజు చెప్పిన మాటలు మాత్రం ఆయనలో ఉన్న కోపాన్ని చూపించాయి. "మనకు కూడా ఓ రోజు వస్తుంది బ్రదర్.. ఎన్నాళ్లిలా సర్దుకుపోతాం" అనే మాట దిల్ రాజు నోట ఆఫ్ ది రికార్డు వచ్చిందని లేటెస్ట్ న్యూస్ ఒకటి బాగా వైరల్ అవుతోంది.

 

నిజానికి దిల్ రాజు ఇప్పుడు ప్రొడ్యూసర్ స్థాయి కంటే ఎక్కువ. కొంతమంది హీరోల్ని గట్టిగా కమాండ్ చేసే రేంజ్ లో  ఉన్నాడు. కానీ ఇక్క ఉన్న పెద్ద సమస్య ఓవైపు మహేష్ బాబు, మరోవైపు అల్లు అర్జున్. వీళ్ల ఇగోలకు ఈ 4 రోజులు ఓ రేంజ్ లో ఇబ్బంది పడ్డాడట దిల్ రాజు. అయితే మొత్తానికి ఈ సారికి ఈ సమస్య సమసిపోయింది. ఇంకో సందర్భంలో ఇదే తరహా ఇగో సమస్య మళ్లీ తెరపైకి రాదని ఏంటి గ్యారెంటీ. ఇప్పుడు మహేష్-బన్నీ ఇగోలకు పోయారు. రేపు మహేష్-ఎన్టీఆర్ ఇగో క్లాష్ అయితే పరిస్థితేంటి? అప్పుడు కూడా దిల్ రాజు లాంటి మరో నిర్మాత ఇబ్బంది పడాల్సిందేనా.  ఇప్పటి నుంచైనా మన హీరోలు మారాలి. అప్పుడప్పుడు నిర్మాతలు చెప్పేది కూడా వినాలి. నిజంగా దిల్ రాజు రేపు ఎప్పుడైనా బరస్ట్ అయి, మనసులో ఉన్నదంతా కక్కితే పరిస్థితేంటి? ఈ హీరోలు ఎలాంటి సంజాయిషీలు ఇచ్చుకోలేరు. అది ఇండస్ట్రీకి కూడా అంత మంచిది కాదు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: