టాలీవుడ్ సినిమా పరిశ్రమలో ప్రస్తుతం టాప్ హీరోలుగా కొనసాగుతున్న వారిలో సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఒకరు. హీరోగా ఎంట్రీ ఇచ్చిన తొలి సినిమా రాజకుమారుడు నుండి మొన్నటి మహర్షి వరకు కెరీర్ పరంగా ఎన్నో సూపర్ డూపర్ హిట్స్ తో పాటు కొన్ని ఫ్లాప్స్ కూడా చవిచూసిన సూపర్ స్టార్ మహేష్ బాబు, మెల్లగా ఎదుగుతూ కోట్లాది మంది ఫ్యాన్స్  తో పాటు తన మార్కెట్ రేంజ్ ని కూడా పెంచుకుంటూ ముందుకు సాగుతున్నారు. తండ్రి సూపర్ స్టార్ కృష్ణ వలె పూర్తిగా నిర్మాతల, దర్శకుల హీరోగా పేరు తెచ్చుకున్న మహేష్ బాబు, ఫ్లాప్స్ వచ్చినపుడు తాను పర్సనల్ గా తీసుకుని అది తన తప్పిదంగా భవిస్తూ గొప్ప మనసుతో మాట్లాడిన సందర్భాలు అనేకం ఉన్నాయి. 

 

ఇక రెండేళ్ల క్రితం మహేష్ హీరోగా, కోలీవుడ్ దర్శకుడు ఏ ఆర్ మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన స్పైడర్ సినిమా, ఎన్నో భారీ అంచనాల మధ్య రిలీజ్ అయి, ఘోర పరాజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. అయితే ఆ సినిమా ఎంతో పెద్ద ఫెయిల్యూర్ అయినప్పటికీ కూడా దర్శకుడు మురుగదాస్ ని మాత్రం ఎప్పటికప్పుడు మెసేజిలు, ఫోన్లు చేస్తూ భవిష్యత్తుపై ఎంతో వెన్ను తట్టి మహేష్ ప్రోత్సహించారని, అలానే మనం ఎంత కష్టపడ్డప్పటికీ కూడా ఒక్కోసారి విజయం వరించదు సర్, కాబట్టి మీరు అధైర్యపడకండి అని చెప్పేవారని, నిన్న తన లేటెస్ట్ సినిమా దర్బార్ రిలీజ్ సందర్భంగా హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మురుగదాస్ తెలిపారు. 

 

మహేష్ గారు చూడడానికి ఎంత అందంగా ఉంటారో, ఆయన మనసు అంతకు మించి మరింత అందంగా ఉంటుందని, దారుణమైన ఫ్లాప్ ఇచ్చిన నన్ను కూడా ఆయన ఆ విధంగా గొప్పగా వెన్నుతట్టి ప్రోత్సహించడం తన జీవితంలో ఎప్పటికి మరిచిపోలేనిదని అన్నారు. వీలైతే అతి త్వరలో ఒక తెలుగు సినిమా చేస్తానని, అయితే ఇక్కడి ఆడియన్స్ ని ఆకట్టుకునేలా కథ రాయడం తనకు ఇంకా పూర్తిగా అర్ధం కాలేదని, తప్పకుండ అతి త్వరలో మంచి సినిమాతో ఆడియన్స్ ముందుకు వస్తానని మురుగదాస్ అన్నారు.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: