నాగార్జున బ్రేక్ కు బ్రేకులేస్తున్నాడు. ఇన్నాళ్లు సైలెంట్ మోడ్ లో ఉన్న నాగ్ ఇపుడు టాప్ గేర్ వేయబోతున్నాడు. ఒకేసారి రెండు సినిమాలను పట్టాలెక్కిస్తున్నాడు. బ్యాక్ టు బ్యాక్ న్యూ మూవీస్ తో సక్సెస్ ట్రాక్ ఎక్కేందుకు నాగ్ సన్నాహాలు చేస్తున్నాడు. 

 

నాగార్జున సక్సెస్ చూసి మూడేళ్లు దాటుతోంది. సోగ్గాడే చిన్నినాయనా తర్వాత ఈ సీనియర్ కు హిట్ అనేదే లేదు. గత రెండేళ్లలో నాగ్ ఐదు సినిమాలు చేస్తే ఒక్క సినిమా కూడా పెట్టుబడి రాబట్టలేకపోయింది. లాస్ట్ ఇయర్ మన్మథుడు2 సినిమా మన్మథుడు మ్యాజిక్ ను రిపీట్ చేస్తుందేమో అనుకుంటే విమర్శల పాలు చేసింది. ఇలా వరుస ఫ్లాపులతో నాగ్ సైలెంట్ అయిపోయాడు. అయితే కాస్త గ్యాప్ తీసుకున్న నాగ్ ఇపుడు స్పీడ్ పెంచాడు. 

 

నాగార్జున ప్రస్తుతం వైల్డ్ డాగ్ అనే మూవీ చేస్తున్నాడు. ఈ చిత్రం ద్వారా సాల్ మన్ అనే కొత్త దర్శకుడు ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఈ సినిమాను మాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ సినిమాను మార్చ్ లో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అలాగే మూడేళ్లుగా మూలుగుతున్న బంగార్రాజు కి కూడా ఈ ఏడాది మోక్షం లభించనుంది. 

 

బంగార్రాజు, సోగ్గాడే చిన్నినాయనా ప్రీక్వెల్ గా రూపొందుతోంది. రెండేళ్లుగా కథ సెట్ అవ్వలేదని నాగార్జున ఈ ప్రాజెక్ట్ ను పక్కన పెట్టేశాడు. దీనికి తోడు నేల టిక్కెట్ సినిమాతో కల్యాణ్ క్రిష్ణ దారుణంగా నిరాశపరచడంతో బంగార్రాజు అటకెక్కింది. అయితే ఇపుడు స్టోరీ పక్కా కుదరడంతో నాగార్జున ఈ క్రేజీ ప్రీక్వెల్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. సమ్మర్ లో ఈ సినిమా స్టార్ట్ అవుతోందని వినికిడి. మొత్తానికి అక్కినేని నాగార్జున వయసు మీద పడినా కుర్ర హీరోలా సినిమాలు చేసుకుంటూ పోతూనే ఉన్నాడు. వీలైతే హీరోగా.. లేకపోతే మల్టీస్టారర్ మూవీస్ లో నటిస్తూ తన కెరీర్ ను లాగిస్తున్నాడు. 

 

 

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: