అల్లు అర్జున్ మహేష్ ల మధ్య ఇగోలు తార స్థాయికి చేరిపోయి కావాలంటే ఒకేరోజు పోటికి రెడీ అంటూ జరిగిన తీవ్ర స్థాయి చర్చలలో మహేష్ తరుఫున దిల్ రాజ్ అల్లు అర్జున్ తరుఫున బన్నీ వాస్ లు తమ సినిమాల రిలీజ్ కు సంబంధించి ఒక చిన్నపాటి యుద్ధమే చేసుకున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి.

అయితే అల్లు అర్జున్ తరఫున ఇంత యుద్ధం చేసిన బన్నీ వాస్ చివరి గంటలో తన పట్టు వదిలేయడం వెనుక గల కారణాలు విశ్లేషిస్తే ఒకటి అల్లు అరవింద్ రెండు త్రివిక్రమ్ అని అంటున్నారు. అల్లు అరవింద్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ లో సభ్యుడు కావడంతో మరొక నిర్మాతకు నష్టం కలిగించే విధంగా తీసుకునే నిర్ణయంలో భాగస్వామి కాలేకపోవడం జనవరి 10 అంటే సెంటిమెంట్ గా భయపడిపోతున్న త్రివిక్రమ్ భయాలు ఈ రెండు కలిసి ఆఖరి నిముషంలో బన్నీ వాస్ చేత మహేష్ తో డైరెక్ట్ ఫైట్ చేసే విషయంలో వెనకడుగు వేయించాయి అని అంటున్నారు. 

దీనితో గత మూడు రోజులుగా ఇండస్ట్రీలో వేడి పోట్టించిన బన్నీ మహేష్ ల డైరెక్ట్ ఫైట్ జరగకపోవడానికి సంబంధించి కుదిరిన అంగీకారం ఏమిటి అని ఆరాలు తీసిన వారికి కొన్ని లీకులు అందుతున్నాయి. తెలుస్తున్న సమాచారం మేరకు ధియేటర్స్ విషయంలో మహేష్ తో పాటు బన్నీకి కూడ సమన్యాయం చేస్తామని మాట ఇచ్చినట్లు తెలుస్తున్నాయి. 

అయితే ‘సరిలేరు’ థియేటర్లు రెండోరోజు తగ్గించేస్తారా? లేదంటే ‘దర్బార్’ కు కేటాయించిన ధియేటర్లు తప్పించి వాటిని బన్నీకి ఇస్తారా అన్న విషయం పై ఇప్పటికీ క్లారిటీ లేదు అని అంటున్నారు. జరిగిన పరిణామాలను పరిణామాలను బట్టి సంక్రాంతి రేస్ విన్నర్ ఎవరు అన్నది సంక్రాంతి పూర్తి అయ్యాక కాని తెలియక పోయినా సంక్రాంతి ఓపెనింగ్ కింగ్ మహేష్  మాత్రమే అంటూ కామెంట్స్ వస్తున్నాయి. వాస్తవానికి మహేష్ సినిమాకు దొరికినన్ని థియేటర్లు బన్నీ సినిమాకు దొరకడం లేదు అన్నది ఓపెన్ సీక్రెట్ గా మారింది. దీనితో సంక్రాంతి ఓపెనింగ్ కలక్షన్స్ వార్ లో అప్పుడే మహేష్ విజయం సాధించాడు అంటూ మహేష్ అభిమానులు బన్నీ అభిమానులను టార్గెట్ చేస్తూ పెడుతున్న కామెంట్స్ తో బన్నీ అభిమానులు మరింత రగిలి పోతున్నారు..   

 

మరింత సమాచారం తెలుసుకోండి: