తమిళనాడు.. రాజకీయంగా చాలా చైతన్యం ఉన్న రాష్ట్రం. అలాంటి రాష్ట్రాన్ని జయలలిత దశాబ్దాల తరబడి ప్రభావితం చేశారు. పాలించారు. తమిళుల గుండెల్లో నిలిచిపోయారు. సినిమా హీరోయిన్ ఆ తర్వాత కాలంలో అంత చక్కటి రాజకీయ వేత్త అవుతుందని ఎవరూ ఊహించి ఉండరు. అంతగా ఆమె తన రాజకీయ చతురతతో రాణించారు. అయితే మరి తమిళనాడుకు మరో సినీ హీరోయిన్ సీఎం అవుతుందా.. అయ్యే అవకాశం ఉందా..?

 

అవుతుందో లేదో తెలియదు కానీ అవ్వాలనే కోరిక మాత్రం ఓ సీనియర్ హీరోయిన్ లో కనిపిస్తోంది. ఆమే ఖుష్బూ. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మీరు మంచి నటి, మంచి నిర్మాత. భవిష్యత్‌లో మంచి సీఎం అయ్యే అవకాశం ఉందా అని అడిగితే.. ఆమె చెప్పిన సమాధానం చూస్తే.. ఏమో ఆమె తమిళనాడు సీఎం కావొచ్చేమో అనిపించింది. ఇంతకీ ఖుష్బూ ఏం చెప్పిందో తెలుసా.

 

నేను సీఎం అవుతానో లేదో.. తెలియదండీ. అలా అనుకోవడం చాలా తొందరపని అవుతుంది. అయితే, సమాజానికి ఏదైనా మంచి చేయాలని మాత్రం ఉంటుంది. రాజకీయాల్లో లేకపోయినా చేస్తా. నేను సీఎం అవుతానా? లేదా? అన్నది నా చేతుల్లో లేదు. ఏదైనా పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటా.. అని చెప్పారు ఖుష్బూ. అలాగే కమల్‌హాసన్‌ ఖుష్బూకు మంచి స్నేహితుడు. మరి మీ ఫ్రెండ్ పార్టీలో ఎందుకు చేరలేదు అని అడిగితే ఖుష్బూ ఏం చెప్పిందంటే..

 

“ 2014లో నేను కాంగ్రెస్‌లో చేరా. కమల్‌గారు ఇప్పుడే ప్రారంభించారు. స్నేహితుడు కదాని ఆయన పార్టీలోకి వెళ్లలేను. ఫ్రెండ్‌షిప్‌ వేరు, రాజకీయాలు వేరు.. అంటూ సమాధాన మిచ్చిందామె. ఖుష్బూ దక్షిణ భారతదేశంలో ఈపేరు తెలియని సినీ అభిమాని ఉండడేమో. తెలుగు, తమిళం, కన్నడం, మళయాళం ఇలా దక్షిణ భారత దేశ భాషల్లోనే కాదు.. ఉత్తరాదిన కూడా హీరోయిన్ గా రాణించిన నటీమణి ఖుష్బూ.. ఇక తమిళనాట హీరోయిన్లకు గుడి కట్టే సంప్రదాయం ఖుష్బూతోనే మొదలైంది. అంతగా ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టారామె. ఇండస్ట్రీకి వచ్చి 40 ఏళ్లయినా ఇంకా ఆమె తెరపై తన ప్రాధాన్యత కోల్పోలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: