విజయశాంతి.. తెలుగు సినీ చరిత్రలో ఇంత సక్సస్ ఫుల్ హీరోయిన్లు చాలా తక్కువ. సావిత్రి తరం తర్వాత ఆ స్థాయిలో విజయవంతమైన హీరోయిన్.. కేవలం హీరోయిన్ గానే కాకుండా హీరోకు సమానంగా స్టార్ డమ్ సాధించుకున్న నటి. సుదీర్ఘకాలం కేరీర్ కొనసాగించిన నటి. ఆ తర్వాత రాజకీయాలవైపు వెళ్లారు. ఎంపీగానూ సేవలందించారు. తాజాగా సరిలేరు నీకెవ్వరు సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ ఆరంభించారు.

 

సరిలేరు నీకెవ్వరు సినిమా విడుదల నేపథ్యంలో ఆమె మీడియాకు ఇంటర్వ్యూలిచ్చారు. అందులో ఆమె తాను ఎందుకు పిల్లను వద్దనుకున్నారో చెప్పారు. ఆమె శ్రీనివాస ప్రసాద్‌ను వివాహం చేసుకున్నారు. ఆ వివాహం అనుకోకుండా జరిగిందట. శ్రీనివాస ప్రసాద్ తో పరిచయం తర్వాత ఒకరి అభిప్రాయాలు మరొకరం పంచుకున్నారట. ఆ తర్వాత పెళ్లి చేసుకోవాలనుకున్నారు. అయితే ఇదంతా దీర్ఘకాలంగా కొనసాగిందేమీ కాదంటోది విజయశాంతి.

 

కోట్లు ఖర్చుపెట్టి మండపాలేసి ఆర్భాటంగా పెళ్లి చేసుకోవడం తనకు ఇకిష్టం లేదు. అందుకే సింపుల్‌గా రిజిస్ట్రార్‌ ఆఫీసులో చేసుకున్నారు. సన్నిహితుల సమక్షంలో తాళి కట్టారు. పెళ్లంటేనే ఒకరిపై ఒకరికి పరస్పర నమ్మకం ఉండాలి. అది తమ ఇద్దరిలో ఉంది అంటున్నారు విజయశాంతి. పెళ్లయి ఇన్నేళ్లయినా ఆమె తల్లి కాలేదు. దీని గురించి చాలామంది చాలా అనుకుంటారు. కానీ.. వాస్తవానికి పిల్లలంటే విజయ శాంతికి చాలా ఇష్టం. అయితే ఒక దశలో పిల్లలుంటే స్వార్థం పెరిగిపోతుందని విజయ శాంతికి అనిపించింది.

 

రాజకీయాల్లోకి వచ్చాక ‘నా’ అనే స్వార్థాన్ని వీడి ‘మన’ అనే ధోరణితో ముందుకెళ్లాలని విజయ శాంతి భావించింది. తనను ఈ స్థాయికి తీసుకొచ్చిన నా ప్రజలకే పూర్తిగా జీవితాన్ని అంకితమివ్వాలని విజయ శాంతి అనుకున్నారు. తన ఆలోచనకు ఆమె భర్త కూడా అండగా నిలబడ్డారు. అందుకే విజయ శాంతి పిల్లలు వద్దనుకున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి: