‘ఆర్ ఆర్ ఆర్’ మూవీ ఫస్ట్ లుక్ గురించి ఎదురు చూసిన అభిమానులకు నిరాశ ఎదురైనా ఈ మూవీకి సంబంధించి ఇప్పుడు లేటెస్ట్ గా ప్రచారంలోకి వస్తున్న ఒక న్యూస్ జూనియర్ అభిమానులకు షాక్ ఇస్తున్నట్లు సమా చారం. ఇప్పటికే రకరకాల కారణాలతో వాయిదా  పడుతూ షూటింగ్ విషయంలో రాజమౌళి పెట్టుక్కున టార్గెట్ ప్రకారం ఈ మూవీ షూటింగ్  జరగకపోయినా అనుకున్న సమయానికి ఈ సినిమాను పూర్తి చేయడానికి ఈ సినిమాకు సంబంధించి సైమల్టేనియస్ గా వీ.ఎఫ్.ఎక్స్ సహా ఇతర కీలకమైన పనుల్ని పూర్తి చేస్తున్నారట. 

ఈ చిత్రంలో అల్లూరి సీతారామరాజు గా చరణ్ కొమరమ్ భీమ్ గా తారక్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకూ ఒకట్రెండు పోస్టర్లు తప్ప తారక్ కి సంబంధించి కానీ ‘ఆర్ ఆర్ ఆర్’ కి సంబంధించి కానీ ఏలుక్ ని రాజమౌళి రిలీజ్ చేయనేలేదు. తారక్ చరణ్ ఫుల్ లెంగ్త్ లుక్ ని రివీల్ చేయకుండా సస్పెన్స్ ని  రాజమౌళి మెయింటెయిన్ చేయడంతో జూనియర్ చరణ్ అభిమానులలో టెన్షన్ రోజురోజుకు పెరిగిపోతోంది.   

తెలుస్తున్న సమాచారం మేరకు ‘ఆర్ ఆర్ ఆర్’ పాత్రధారుల్ని పరిచయం చేసే కార్యక్రమాన్ని ఈ ఏడాది ఉగాది నుండి రాజమౌళి ప్రారంభిస్తాడు అని అంటున్నారు. ఈ చిత్రంలో తారక్ జుత్తు లేకుండా గుండుతో కనిపిస్తాడన్న లీకులు విని జూనియర్ అభిమానులు ఖంగారు పడిపోతున్నారు.  

అంతేకాదు ఈ సినిమాలో ఏడెనిమిది పాటలు ఉంటాయి అన్న కొత్త లీకులు కూడ వస్తున్నాయి. స్వాతంత్ర పోరాట యోధుల పై దేశభక్తి గీతం రామ్ చరణ్ అలియా ఎన్టీఆర్ ఒలీవియా మోరిస్ జంటల మధ్య రొమాంటిక్ గీతాలు ఉంటాయట. ashok TEJA' target='_blank' title='సుద్దాల అశోక్ తేజ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>సుద్దాల అశోక్ తేజ మూడు పాటలు ఈ సినిమా కోసం ప్రత్యేకంగా వ్రాశాడు అన్న వార్తలు వస్తున్నాయి. అయితే తారక్ ను జుట్టు లేకుండా గుండుతో చూపిస్తే అభిమానులు అంగీకరిస్తారా అన్నదే సందేహం.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: