ప్రభాస్ సాహో సినిమా రిలీజై ఇప్పటికే నాలుగు నెలలు పూర్తయింది. సాహో సినిమా విడుదలకు ముందే ప్రభాస్ నటిస్తోన్న జాన్ సినిమా 25 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. జాన్ సినిమాకు సంబంధించిన లేటెస్ట్ అప్ డేట్స్ బయటకు రావటం లేదు. ఇలాంటి సమయంలో జాన్ సినిమాకు సంబంధించిన కొన్ని వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా ఫిల్మ్ నగర్ వర్గాల్లో ఒక వార్త చక్కర్లు కొడుతోంది. 
 
ప్రభాస్ జాన్ సినిమాలో సరికొత్తగా కనిపించాలని అనుకుంటున్నాడని ఎన్టీయార్ పర్సనల్ ట్రైనర్ లాయిడ్ స్టీవెన్స్ ను ఇందుకోసం సంప్రదించాడని వార్తలు వినిపిస్తున్నాయి. లాయిడ్ స్టీవెన్స్ గతంలో మెరైన్ టెక్నీషియన్ గా పని చేసేవారు. మెరైన్ టెక్నీషియన్ గా పని చేసే సమయంలో ఊబకాయంతో ఇబ్బంది పడిన లాయిడ్ ఆ తరువాత తనను తాను ఫిట్ గా మార్చుకుని ఫిట్ నెస్ ట్రైనర్ గా మారాడు. 
 
రణవీర్ సింగ్ లాంటి యంగ్ హీరోలు సిక్స్ ప్యాక్ లో కనిపించటం వెనక లాయిడ్ స్టీవెన్స్ కృషి ఉంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీయార్ హీరోగా తెరకెక్కిన అరవింద సమేత సినిమా కోసం లాయిడ్ స్టీవెన్స్ పని చేశాడు. విదేశాల నుండి ప్రత్యేకమైన ఎక్విప్మెంట్ ను తెప్పించిన లాయిడ్ స్టీవెన్స్ ఎన్టీయార్ అరవింద సమేతలో సిక్స్ ప్యాక్ లుక్ లో చూపించాడు. ప్రస్తుతం ఆర్.ఆర్.ఆర్. సినిమాలో ఎన్టీయార్ లుక్ కోసం లాయిడ్ పనిచేస్తున్నాడు. 
 
ప్రభాస్ సినిమా కోసం లాయిడ్ స్టీవెన్స్ పని చేస్తున్నాడన్న వార్త వైరల్ కావటంపై లాయిడ్ స్టీవెన్స్ స్పందించాడు. లాయిడ్ స్టీవెన్స్ తన ట్విట్టర్లో " ప్రభాస్ అభిమానులను నిరాశ పరుస్తున్నందుకు క్షమించండి. వైరల్ అవుతున్న వార్తలో ఎటువంటి నిజం లేదు. ఇటువంటి పుకార్లు ఎలా వస్తాయో కూడా నాకు అర్థం కావటం లేదు" అని చెప్పారు. అలా ప్రభాస్ అభిమానులకు ఎన్టీయార్ ట్రైనర్ సారీ చెప్పారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: