దశాబ్ధ కాలంగా తన అందం అభినయంతో మెప్పిస్తూ వచ్చిన మిల్కీ బ్యూటీ తమన్నా తెలుగులో స్టార్ హీరోలందరితో కలిసి నటించింది. ఇప్పటికి తెలుగులో క్రేజీ ఛాన్సులు అందుకుంటున్న ఈ అమ్మడు లేటెస్ట్ గా సూపర్ స్టార్ మహేష్ సరిలేరు నీకెవ్వరు సినిమాలో సర్ ప్రైజ్ ఇవ్వనుంది. హీరోయిన్ గానే కాదు ఐటం సాంగ్స్ తో కూడా అలరిస్తున్న మిల్కీ బ్యూటీ తమన్నా సరిలేరు నీకెవ్వరు సినిమాలో కూడా స్పెషల్ నంబర్ తో వస్తుంది. ఇప్పటికే ఆ సినిమా నుండి వచ్చిన ప్రోమోలో మిల్కీ మెరుపులు సినిమాపై అంచనాలు పెంచాయి. 

 

జనవరి 11న రిలీజ్ అవుతున్న సరిలేరు నీకెవ్వరు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈరోజు సాయంత్రం 5 గంటలకు ఎల్బి స్టేడియంలో జరుగనుంది. ఈ వేడుకలకు మెగాస్టార్ చిరంజీవి చీఫ్ గెస్ట్ గా వస్తున్నారు. మెగా సూపర్ ఈవెంట్ గా సరిలేరు నీకెవ్వరు ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతుంది. ఇక ఈ ఈవెంట్ ను చాలా గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారు. సినిమాలో ఐటం సాంగ్ చేసిన మిల్కీ బ్యూటీ తమన్నా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా లైవ్ పర్ఫార్మెన్స్ చేస్తుందని తెలుస్తుంది. 

 

తనకు అవకాశం వచ్చిన సినిమా కోసం మ్యాక్సిమం ఎఫర్ట్ పెట్టే తమన్నా సినిమా ప్రమోషన్స్ కు ఫుల్ సపోర్ట్ గా ఉంటుంది. లాస్ట్ ఇయర్ సైరా సినిమాలో స్పెషల్ రోల్ చేసి మెప్పించిన తమన్నా ఈసారి మహేష్ పక్కన ఐటం సాంగ్ తో అలరించనుంది. ఆల్రెడీ మహేష్ తో తమన్నా ఆగడు సినిమాలో నటించింది. శ్రీను వైట్ల డైరక్షన్ లో వచ్చిన ఆ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు. అయితే సరిలేరు స్పెషల్ సాంగ్ లో మాత్రం మహేష్ తమన్నా ఆదరగోట్టేశారు. మరి ఈ సినిమాకు తమన్నా ఎంతవరకు ప్లస్ అవుతుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: