టాలీవుడ్ లో చిరంజీవి తర్వాత పవన్ కల్యాణ్ కే భారీ ఫ్యాన్ బేస్ ఉందనడంలో అతిశయోక్తి లేదు. ఎంతగా అంటే పవన్ ఫ్యాన్స్ సపోర్ట్ ఉంటే ఏదైనా సాధ్యమే అనేంతగా. అది సినిమా, రాజకీయాల పరంగా పవన్ సాధించిన ఘనతే అని చెప్పాలి. అటువంటి పవన్ ఫ్యాన్స్ తో మరో మెగా హీరో, అల్లు అర్జున్ పెట్టుకున్న గొడవ సంగతి తెలిసిందే. సరైనోడు సినిమా సమయంలో విజయవాడలో ఫంక్షన్ సందర్భంగా పవన్ ఫ్యాన్స్ ఆయన గురించి బన్నీని మాట్లాడాలని కోరితే.. ‘చెప్పను బ్రదర్’ అని ఓపెన్ గా చెప్పేశాడు. ఇప్పటికీ అది ఓ ఫేమస్ డైలాగ్ గా మిగిలిపోయింది.

 

 

అప్పటినుంచీ పవన్ ఫ్యాన్స్ బన్నీని టార్గెట్ చేశారు. ఆ ప్రభావం ఎలా ఉంటుందో దువ్వాడ జగన్నాధం సినిమాతో బన్నీకి పక్కాగా తెలిసొచ్చింది. దావ్వాడ జగన్నాధం ఓపెనింగ్స్, కలెక్షన్స్, టాక్, యూట్యూబ్ వ్యూస్ వంటి వాటి మీద పవన్ ఫ్యాన్స్ ఓ రేంజ్ లో తమ ప్రతాపం చూపించారు. నా పేరు సూర్యకు ఆ ఎఫెక్ట్ ఉంది. ఇప్పటికీ పవన్ ఫ్యాన్స్ ఆగ్రహం చల్లారలేదని అంటారు. అప్పటి నుంచి మెగా, పవర్ ఫ్యాన్స్, బన్నీ ఫ్యాన్స్ గా వేరు పడిపోయారు. ఓ మహిళ పవన్ మీద చేసిన ఆరోపణల నేపథ్యంలో ఆయన ఫిలిం చాంబర్ కి రావడం ఓ సంచలనం. ఆ సమయంలో పవన్ ఫ్యాన్స్ ఆయనకు అండగా ఉంటే ప్రేక్షకులు కూడా మద్దతు పలికారు.

 

 

ఆ సమయంలో బన్నీ చాంబర్ కి స్వచ్చందంగా వచ్చి పవన్ ఆలింగనం చేసుకుని తప్పైందన్నట్టుగా సంకేతాలు పంపాడు. అప్పటినుంచీ కాస్త మెత్తపడ్డారు పవన్ ఫ్యాన్స్. ఇప్పుడు బన్నీ అల.. వైకుంఠపురంలో విడుదల కాబోతోంది. అసలే సంక్రాంతి పోటీ ఉంది. ఈ సమయంలో పవన్ ఫ్యాన్స్ పాత గొడవల్ని మర్చిపోయి బన్నీకి అండగా ఉంటే మెగా రికార్డులు ఖాయం అంటున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: