బన్నీ త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం అల వైకుంఠపురములో చిత్రం జనవరి 12 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ మెరకు అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే రేపు ఈ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరపడానికి సన్నాహాలు చేస్తున్నారు. అల వైకుంఠపురములో సినిమాని అల్లు అరవింద్ కుటుంబ సభ్యులు ఆల్రెడీ చూశారట. వారి ప్రకారం సినిమా గ్యారెంటీగా ప్రేక్షకులకి నచ్చుతుందనే భావనలో ఉన్నారు.

 


సినిమాలో ఎమోషనల్ సన్నివేశాలు మనసుని మెలిపెట్టేలా ఉంటాయని టాక్. త్రివిక్రమ్ సినిమాల్లో మెలో డ్రామా కొంచెం ఎక్కువగా ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కూడా మెలోడ్రామాగా సాగుతుందని అంటున్నారు. అయితే అల వైకుంఠపురములో కథ ఎలా పుట్టిందో త్రివిక్రమ్ చెప్పేశాడు.  ఎంత పెద్ద సినిమాలైనా చిన్న ఆలోచన నుండే పుడతాయి. అలా త్రివిక్రమ్ కి కలిగిన ఒక ఆలోచనే ఈ సినిమాకి ప్రేరణ.

 

ఎవ్వరికైనా స్థానాన్ని ఇవ్వగలమేమో గానీ స్థాయిని ఇవ్వలేమనేది అల వైకుంఠపురములో కథకి బీజమట.ఈ మాటలని త్రివిక్రమ్ ఈ విధంగా వివరించాడు. సంపద, ఐశ్వర్యం వేరు వేరు. గొప్పింట్లోకి వెళితే కాసేపటికి బోర్ కొట్టేస్తుంది. అదే మధ్యతరగతి ఇంట్లో అన్నీ దొరుకుతాయి. అక్కడ సంపద ఉంటే, ఇక్కడ ఐశ్వర్యం ఉంటుంది. ఈ అంశాన్నే సరదాగా చెప్పాలనుకుని ఈ కథ రాశారట త్రివిక్రమ్.

 

టీజర్ లో ఈ కథలోని కొన్ని అంశాలు లీలగా మనకి కనిపిస్తాయి. అయితే త్రివిక్రమ్ చెప్పాలనుకున్న ఆలోచన ఎంత మేరకు సక్సెస్ సాధిస్తుందో జనవరి 12 వ తేదిన తెలుస్తుంది. హారికా హాసినీ క్రియేషన్స్ బ్యానర్ మరియు గీతా ఆర్ట్స్ సంయుక్తంగా కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రంలో బన్నీకి జోడీగా పూజా హెగ్డే నటిస్తుండగా, సీనియర్ హీరోయిన్ టబు ఓ కీలక పాత్రలో కనిపించనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: