ఇపుడు ఉన్న స్టార్ హీరోస్ లో ప్రస్తుతం ఫామ్ లో ఉన్న హీరో జూనియర్ ఎన్టీఆర్... జూనియర్ ఎన్టీఆర్ కి అభిమానులు కూడా ఎక్కువే. నందమూరి తారక రామారావు మనవడిగా సినీ రంగ ప్రవేశం చేసాడు . నందమూరి కుటుంబం లో పేరు ఉన్న హీరో జూనియర్ ఎన్టీఆర్... డ్యాన్స్, డైలాగ్ డెలివరీ, ఫైట్స్, యాక్టింగ్‌లో రాణిస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు.

 

కెరీర్ ఆరంభంలోనే భారీ విజయాలను తన ఖాతాలో వేసుకున్నారు తారక్. కొన్ని సినిమాలు ప్లాప్ అయిన గాని ఎన్టీఆర్ ఇమేజ్ మాత్రం ఏమి తగ్గలేదు. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ గూర్చిన ఒక విషయం సోషల్ మీడియా లో హల్చల్ చేస్తుంది.. వివరాల్లోకి వెళితే.. జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఒక మల్టీస్టార్  ఆర్.ఆర్.ఆర్ సినిమాలో నటిస్తున్నాడు...

 

రాంచరణ్ అండ్ ఎన్టీఆర్ ఇద్దరు హీరోలు. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ మూవీలో తారక్.. కొమరం భీంగా, చరణ్.. అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నారు. వీళ్ల సరసన ఒలీవియా మోరిస్, ఆలియా భట్ ఆడి పాడనున్నారు. వీళ్లతో పాటు చాలా మంది ప్రముఖులు కీలక పాత్రలు చేస్తున్నారు.ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఎందుకంటే దర్శక దిగ్గజం మరియు ఇద్దరు బడా హీరోలు కలిసి నటిస్తున్న సినిమా కావడంతో అంచనాలు కూడా పెద్దగా ఉన్నాయి. ఈ సినిమా కోసం అతడు ఎంతగానో శ్రమిస్తున్నాడు.

 

మంచి ఫిజిక్ కోసం కొద్ది రోజుల నుంచి జిమ్‌లో చమటోడ్చుతూనే ఉన్నాడు. అలాగే, లుక్ విషయంలోనూ తగు జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. అలాగే ఎన్టీఆర్ గూర్చి ఇంకొక విషయం ఏంటంటే ఒక్క తెలుగులోనే కాకుండా అన్ని భాషల్లో సొంతంగా డబ్బింగ్ చెప్పుకోవాలని భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అతడికి దక్షిణాది భాషలతో పాటు హిందీ పైనా పట్టు ఉండడంతోనే రాజమౌళి కూడా ఓకే చెప్పాడని టాక్.అలాగే రాజమౌళి చెప్పారని ఇంకొక నిర్ణయం కూడా తీసుకున్నారట.. కానీ ఈ నిర్ణయం పట్ల అభిమానులు ఇలా స్పందిస్తారనేది తెలియాల్సిన విషయం..

 

అసలు ఆ నిర్ణయం ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ గురించి ఓ షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. దీని ప్రకారం.. ఈ సినిమా కోసం తారక్ గుండుతో కనిపించబోతున్నాడట. క్లైమాక్స్‌లో వచ్చే పదిహేను నిమిషాల ఫైట్ కోసం ఈ స్టార్ హీరో.. తన జుట్టును తీసేయడానికి సిద్ధం అయ్యాడని అంటున్నారు. రాజమౌళి సూచన మేరకే అతడు ఈ నిర్ణయం తీసుకున్నాడన్న టాక్ వినిపిస్తోంది. గుండు గెటప్ లో జూనియర్ ఎన్టీఆర్ ని అభిమానులు ఇలా రిసీవ్ చేసుకుంటారనే విషయం ఆసక్తి గా మారింది..

మరింత సమాచారం తెలుసుకోండి: