నందమూరి బాలకృష్ణ హీరోగా కెఎస్ రవికుమార్ తెరకెక్కించిన సినిమా రూలర్. పవర్ ఫుల్ టైటిల్‌తో వచ్చిన ఈ చిత్రం కథ విషయంలో మాత్రం అది చూపించలేకపోయింది.  డిసెంబర్ 20న విడుదలైన ఈ చిత్రం తొలిరోజుమార్నింగ్ షోతోనే నెగిటివ్ టాక్ తెచ్చుకుంది ఈ చిత్రం.  జై సింహా లాంటి కమర్షియల్ హిట్ తర్వాత సేమ్ కాంబినేషన్‌‌‌లో వచ్చిన సినిమా కావడంతో అంచనాలు భారీగానే ఉన్నా కానీ.. టాక్ తేడాగా రావడంతో బాక్సాఫిస్ వ‌ద్ద చ‌తికిల‌ప‌డిపోయింది. అలాగే 2019 స్టాటింగ్‌లో వ‌చ్చిన ఎన్టీఆర్ బ‌యోపిక్ కూడా బాల‌కృష్ణ‌కు నిరాశే మిగిల్చింది. ఇక ఎంతటి స్టార్ హీరో అయినా వరుస ఫ్లాప్‌లు ఎదురైతే ఇబ్బందులు తప్పవు.

 

ఇక ఇదిలా ఉంటే.. మంచి కథలు ఎక్కడ ఉన్న వెతికి పట్టుకోవడంలో టాలీవుడ్ సీనియర్ హీరో వెంకటేష్ తర్వాతే ఎవరైనా. ఆల్రెడీ రీమేక్ రాజాగా ఈ బొబ్బిలి రాజాకు మంచి ఇమేజ్ ఉంది. ఇప్పటికే వేరే భాషల్లో హిట్టైన ఎన్నో సినిమాలను తెలుగులో రీమేక్ చేసి సక్సెస్ అందుకున్న వెంకీ మామ. గతేడాది మొదట్లో ‘ఎఫ్ 2’ వంటి సక్సెస్‌ఫుల్ మూవీతో బోణి చేసిన వెంకటేష్.. ఇయర్ ఎండింగ్‌లో మేనల్లుడు నాగ చైతన్యతో కలిసి ‘వెంకీ మామ’ సినిమాతో సక్సెస్‌తో మంచి ముగింపు పలికాడు. ఇక తాజాగా తమిళంలో హిట్టైయిన ‘అసురన్’ సినిమాను తెలుగులో రీమేక్ చేయడానికి ఓకే చెప్పాడు.


 
ఇలా వెంకీ మార్కెట్ త‌గ్గ‌డంతో మ‌ల్టీస్టార‌ర్లు చేస్తూ మంచి హిట్లు కొడుతూ ఇత‌ర హీరోల‌కు ఆద‌ర్శంగా మారుతున్నాడు.. కానీ బాల‌య్య మాత్రం సింగిల్‌గానే సినిమాలు చేస్తూ.. అన్ని డిజాస్ట‌ర్లు చేస్తున్నాడు. అలాగే చిరు, నాగ్ కూడా సింగిల్ సినిమాలు చేస్తున్నా వాళ్లు మ‌రీ బాల‌య్య‌లా చెత్త క‌థ‌ల‌తో రావ‌డం లేద‌నే చెప్పాలి. ఇక‌ వెంకీకి ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో మంచి క్రేజ్ ఏర్ప‌డింది. ఈ క్ర‌మంలోనే బాల‌య్య‌ను వెంకీని చేసి నేర్చుకుంటే మంచిది అని ఇండ‌స్ట్రీలో గుస‌గుస‌లాడుతున్న‌ట్టు తెలుస్తోంది. కాగా, బాల‌కృష్ణ ప్ర‌స్తుతం బోయ‌పాటి ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా ప‌ట్టాలెక్కిన సంగ‌తి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: