బాలీవుడ్ హీరోయిన్ విద్యాబాల‌న్ ఇటీవ‌లె సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. లేటు వయస్సులో కెరీర్ ప్రారంభించిన విద్యాబాలన్ తొలి నాళ్లలో అడ్వర్టయిజ్ మెంట్స్ లో నటించానని చెప్పుకొచ్చింది. టాలెంట్ ఉన్నప్పటికీ కారణం ఏంటో చెప్పకుండానే తనను పక్కన పెట్టేవారని వాపోయింది. అప్పట్లో 2002లో మాధవన్ హీరోగా తెరకెక్కిన 'రన్' సినిమాలో మొదట హీరోయిన్‌గా విద్యాబాలన్‌ను తీసుకున్నారు. ఆ తర్వాత ఏమైందో ఏమో ఆమె ప్లేస్‌లో మీరా జాస్మిన్‌ను హీరోయిన్‌గా తీసుకున్నారు. ఆ తర్వాత కూడా కొన్ని సినిమాల్లో విద్యాబాలన్‌కు అవకాశాలు వచ్చినట్టే వచ్చి చేజారాయి. ఈ రకంగా కెరీర్లో ఎన్నో ఎత్తు పల్లాలు చూశానని చెప్పుకొచ్చింది ఈ సౌత్ సుందరి. విద్యాబాలన్ తన గురించి చెబుతూ..తాను మామూలు మధ్యతరగతి నుంచి వచ్చానని, తన కుటుంబంలో ఎవరూ సినిమా బ్యాక్ గ్రౌండ్ కు సంబంధం ఉన్నవాళ్లు లేరని విద్యాబాలన్ తెలిపింది. బాలీవుడ్‌లో 'పరిణీత' సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత 'డర్డీ పిక్చర్స్' సినిమాతో ఓవర్ నైట్ స్టార్ స్టేటస్ అందుకుంది.

 

అయితే బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ నటించిన మిషన్ మంగళలో విద్యాబాలన్ నటించింది. ఈ చిత్రం ఆగష్టు 15న విడుదల కానుంది. మార్స్ మిషన్‌ ప్రయోగంపై ఈ చిత్రం తెరకెక్కింది. ఈ మూవీతో పాటు తమిళంలో అజిత్ సరసన నెర్‌కొండ పార్వై(పింక్)రీమేక్‌లో నటించింది. కోలీవుడ్‌లో ఆమెకు ఇదే తొలి చిత్రం కావడం విశేషం.

 

 అక్షయ్‌ కుమార్‌ వంటి దిగ్గజ స్టార్‌లు లేకుండానే ఏదో ఒక రోజు మహిళా స్టార్‌లతో ఏదో ఒక రోజు రూ 200 నుంచి రూ 500 కోట్ల బడ్జెట్‌తో సినిమాలు తెరకెక్కుతాయని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు. అక్షయ్‌ కుమార్‌తో జోడీగా గత ఏడాది విడుదలైన మిషన్‌ మంగళ్‌లో మహిళా నటులు అధికంగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ చిత్ర విజయంలో అందరి పాత్ర ఉన్నా ప్రధానంగా సక్సెస్‌ ఖిలాడీ ఖాతాలోకి వెళ్లింది. కమర్షియల్‌ సినిమాలో మహిళల పాత్రపై విద్యాబాలన్‌ మాట్లాడుతూ గతంలో మహిళా ఓరియెంటెడ్‌ సినిమాలు తక్కువగా వచ్చేవని, ఇప్పుడు మెయిన్‌స్ర్టీమ్‌ కమర్షియల్‌ చిత్రాల్లో మహిళల చుట్టూ కథ తిరిగే చిత్రాలు పెరిగాయని చెప్పుకొచ్చారు. విద్యాబాలన్‌ కహానీ, తుమ్హరీ సులు, డర్టీ పిక్చర్‌, బేగం జాన్‌, పరిణీత వంటి పలు మహిళా ప్రాధాన్యత కలిగిన చిత్రాల్లో లీడ్‌ రోల్‌లో నటించి ప్రేక్షకులను మెప్పించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: