మహేశ్ బాబు హీరో గా వచ్చే ఏ సినిమా ఐనా ప్రేక్షకులకి విపరీతమైన ఆసక్తి ఉంటుంది. మహేశ్ అంటే ఫామిలీ ఆడియన్స్ దగ్గర నుంచి, యూత్, స్టూడెంట్స్ తో పాటు ముఖ్యంగా అమ్మాయిలు ఎక్కువగా ఎగబడతారు .. ఇప్పటికే టీజర్ , సాంగ్స్ తో ఇరగదీస్తున్న ఈ సినిమా బృందం - ట్రెయిలర్ తో ఎలాంటి సర్ప్రైజ్ ఇస్తుంది అనేది ఆసక్తికరం. అనిల్ రావిపూడి దర్శకత్వం లో వస్తున్న ఈ సినిమా మీద డిస్ట్రిబ్యూటర్ లు విపరీతమైన అంచనాలు పెట్టుకున్నారు. తాజాగా హైదరబాద్ లో జరుగుతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి మెగా స్టార్ చిరంజీవి అతిథి గా విచ్చేసిన సంగతి తెలిసిందే.

 

మెగా - సూపర్ ఈవెంట్ గా నామకరణం చేసిన ఈ ప్రోగ్రామ్ ని చూడడం కోసం హైదరబాద్ నుంచే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాల లోని అనేక ప్రాంతాల నుంచి మహేశ్ బాబు అభిమానులు పొటెత్తారు. మహేశ్ బాబు సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి చిరంజీవి వస్తున్నారు అని తెలిసి హైదరబాద్ లోని వందలాది మంది చిరంజీవి అభిమానులు కూడా ఇక్కడకి రావడం కనిపించింది.

 

'సైరా' టీ షర్ట్ లతో చాలా మంది బ్యాచ్ లు బ్యాచ్ లు గా కనిపిస్తున్నారు. మహేశ్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ లు ఈ మధ్య కాలం లో డిఫరెంట్ గా ప్లాన్ చేస్తున్నాడు. ఆ మధ్య భారత్ అనే నేను ఫంక్షన్ కి జూనియర్ ఎన్‌టి‌ఆర్ ని గెస్ట్ గా పిలిచిన సంగతి తెలిసిందే. ఈ సారి చిరు ని పిలవడం తో చిరు ఫాన్స్ ఎక్కువగానే వచ్చారు. ఇదే తరుణంలో సినిమా యూనిట్ సభ్యులు అభిమానులకు ఎక్కడా కూడా కష్టం కలగకుండా తోపులాట జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు 

మరింత సమాచారం తెలుసుకోండి: